బాలయ్య అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలి

- Advertisement -

బాలయ్య అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలి

Balayya must move forward unstoppably

ఎన్బీకే 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై సీఎం చంద్రబాబు  శుభాకాంక్షలు

ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కోన్నారు. . 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలయ్య…ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తూ, నేటి తరాన్ని కూడా అలరించే చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జానర్లలో నటించి తానేంటో చాటిచెప్పారు. కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించి, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular