లేడీ యాంప్తుల్ లో భోజనశాలకు బండి రామకృష్ణ మూడు లక్షల విరాళం

- Advertisement -

లేడీ యాంప్తుల్ లో భోజనశాలకు బండి రామకృష్ణ మూడు లక్షల విరాళం
మచిలీపట్నం, జులై 25
Bandi Ramakrishna donates three lakhs for the dining hall at Lady Amptul.

కృష్ణాజిల్లాలోని ఏకైక మహిళ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేడి యాంప్తుల్ బాలికల జూనియర్ కళాశాలలో భోజనశాల నిర్మాణం నిమిత్తం కృష్ణా జిల్లా డీ.సీ.ఎం.ఎస్ చైర్మన్ మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ డి సి ఎం ఎస్ నిధుల నుండి కొంత స్వంత నిధులు నుండి కొంత మొత్తం 3 లక్షల రూపాయలు లేడియాంప్తుల్ కళాశాల లో భోజన శాల నిర్మాణానికి మంజూరు చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అధికారులు శంకుస్థాపన చేశారు.

ఎంతో కాలంగా భోజనశాల లేక ఎండలోనే భోజనాలు వండుతూ మహిళలు విద్యార్థినిలు  తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతంలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య  సూచన మేరకు స్పందించిన బండి రామకృష్ణ తక్షణమే నిధులను కేటాయించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సాధ్యమైనంత త్వరగా బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి విద్యార్థినిలు అందిస్తామని బండి రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ లేడీ యాంప్తుల్ కళాశాల జిల్లాలో అగ్రస్థానంలో ఉందని విద్యా ప్రమాణాలు ఉన్నతంగా పెరిగాయని అదునపు తరగతి గదుల అవసరం ఎంతైనా ఉందని అందుకు ప్రభుత్వం నుండి ఎంపీ  ఫండ్స్ నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ కొనకల్ల బుల్లయ్య జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ జనసేన పార్టీ నాయకులు కొట్టే వెంకట్రావు, గడ్డం రాజు, శివయ్య, పినిశెట్టి వేణు కొండ మేస్త్రి,చంటి, చిరంజీవి, రమేషు, గంపల కృష్ణ గంపల గంగాభవాని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి సరళ కుమారి కళాశాల ప్రిన్సిపాల్ పి.లక్ష్మి ఎన్.ఎస్.ఎస్. అధికారి లంకిశెట్టి హరనాధ్ బాబు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular