బాలానగర్ : అక్టోబర్ 30(వాయిస్ టుడే): కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని సోమవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని శోభన ప్రాంతంలోని ఎస్ఎంఆర్ వినయ్ క్యాపిటల్ బిల్డింగ్ లో ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూకట్ పల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు వందలాది మంది పాల్గొన్న కాంగ్రెసు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అందరితో పంచుకుని కూకట్ పల్లి
నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీపై రోడ్లు వేసి అభివృద్ధి చేశామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు.

రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి సారధ్యంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సమస్యను తీర్చి ప్రజలకు సేవ చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు, మైనారిటీలు, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎదురు చూస్తురన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి అందరం కలిసి కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బంగారు తెలంగాణ అనేది కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా చేశారని కేసీఆర్ పై విమర్శలు కురిపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజమైన బంగారు తెలంగాణ ఏ విధంగా ఉంటుందో తెలంగాణ ప్రజలకు చేసి చూపిస్తామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో 13 కిలోమీటర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టించి ట్రాఫిక్ సమస్యను తగ్గించిందని గుర్తు చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా తాను తీసుకుంటానని బండి రమేష్ తెలియజేశారు. కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా వైద్యం, విద్య, ఉపాధి ఈ మూడు రంగాలలో కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని బండి రమేష్ హామీ ఇచ్చారు.



