21.2 C
New York
Friday, May 31, 2024

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన బండి సంజయ్

- Advertisement -

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన బండి సంజయ్
కరీంనగర్
ఎంపి బండి సంజయ్ మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు. కేసీఆర్…నన్ను ఓడించేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటావా? హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా? 20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా ? హిందువులారా…. మీ సత్తా ఏందో కేసీఆర్ కు మళ్లీ రుచి చూపించండని అన్నారు. కేసీఆర్… నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. వినోద్ ఓడిపోతే… బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా? నా వెనుక 80 శాతం హిందువులున్నారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు బుద్ది చెప్పండి. కేటీఆర్ నోటి నుండి జై శ్రీరాం మాటే రాదు. కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా? కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో 1400 మంది ప్రాణాలను బలిగొన్న రాక్షసుడివి నువ్వే. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడివి కేసీఆరే. రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు కేసీఆరే. ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకరిస్తున్న దగుల్బాజీ కేసీఆర్. తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే. *కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? చర్చకు సిద్ధమైతే… పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం. కేసీఆర్ తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం చేస్తోంది. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్. ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్. అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు. సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా. బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా? విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా? రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది? తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది. కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్ ను ఖండిస్తున్నానని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!