*
•తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్*
హిమాయత్ నగర్:- మార్చ్ 02; ( వాయిస్ టూ డే)
హిమాయత్‌నగర్,, మార్చి 02 : మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడిన బండి సంజయ్ ని బీజేపీ అధిష్టానం వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ గౌడ్ మాట్లాడుతూ
బండి సంజయ్ వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు కూడా అసహ్యించు కుంటున్నాయన్నారు. కరీంనగర్ సహా రాష్ట్ర ప్రజలందరూ సంజయ్ ను ఛీ కొడుతున్నారని, సంజయ్ ని పార్టీ నుండి బహిష్కరిస్తేనే బీజేపీ పరువు నిలబడుతుందన్నారు. లేదంటే తగిన మూల్యం తప్పదని అయన హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెంటనే అతనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనీ, జాతీయ నాయత్వం అతని కామెంట్స్ ను పరిశీలించి పార్టీ నుండి వెంటనే బహిష్కరించాలని, లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క బిసి ఓటు కూడా బీజేపీకి పడదని, రాష్ట్రంలోని బీసీలు ఐక్యంగా బీజేపీ ఓటమికి కృషి చేస్తారని బద్దం ధనుంజయ్ గౌడ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో సిటీ ప్రెసిడెంట్ దేవేందర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ధనుంజయ్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి సిద్దు గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు అనురాధ గౌడ్, నాయకులు నవీన్, సురేష్, కృష్ణ,శ్రీనివాస్, భాస్కర్, మహేష్, కాశీ, సందేశ్, విష్ణు, నర్సింహా, బాధ్రయ్య, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.