బండి సంజయ్ ధర్నాలు, దీక్షలు మానుకోవాలి
మంత్రి పొన్నం
హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి గా పట్టించుకోని బండి సంజయ్ కి ఇప్పుడు రైతులు గుర్తొచ్చింది . ఈ దీక్ష ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేయాలి. వర్షాలు లేవు కరువు వచ్చింది.. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర బండి సంజయ్ అడగాలి. రైతుల దగ్గర బండి సంజయ్ మొసలి కన్నీరు కారుస్తున్నారు . కాళేశ్వరం మునిగితే కేసిఆర్ ఎక్కడికి పోయావు. ఈరోజు రైతుల పొలాల దగ్గర రాజకీయం చేస్తున్నావు. ధర్నాల దీక్ష లే పేరుతో రాజకీయం మానుకోవాలని అన్నారు.
బండి సంజయ్ ధర్నాలు, దీక్షలు మానుకోవాలి
- Advertisement -
- Advertisement -