Wednesday, March 11, 2026

బీజేపీ అధికారంలోకొస్తే బండి సంజయ్ సీఎం అవుతారు

- Advertisement -

బీజేపీ గెలిచే స్థానాల్లో ఫస్ట్ ప్లేస్ కరీంనగర్ దే
కర్నాటక ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ మానప్ప ఒజ్జూర్

కరీంనగర్, నవంబర్ 04 (వాయిస్ టుడే): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అర్హత, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కర్నాటక లింగసుగుర్ శాసనసభ్యులు, కరీంనగర్ ఎన్నికల ఇంఛార్జీ మానప్ప ఒజ్జల్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలవబోయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరీంనగర్ అసెంబ్లీ మొదటి స్థానంలో ఉందన్నారు. మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు తమకు నివేదికలు అందాయన్నారు. జూబ్లినగర్ లో జరిగిన కరీంనగర్ రూరల్ మండల నాయకులు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల విస్త్రతస్థాయి సమావేశంలో మానప్ప ఒజ్జల్ మాట్లాడుతూ బండి సంజయ్ హార్డ్ వర్క్, కరీంనగర్ కార్యకర్తల కష్టపడే తత్వంవల్లే గెలుపు ఈజీగా మారిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ పార్టీ బలోపేతానికి ఎనలేని క్రుషి చేశారన్నారు. కరీంనగర్ రూరల్ మండల విస్త్రతతెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని బండి సంజయ్ ను కనీవినీ ఎరగని రీతిలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.

bandi-sanjay-will-become-cm-if-bjp-comes-to-power
bandi-sanjay-will-become-cm-if-bjp-comes-to-power

అనంతరం కర్నాటక ఎమ్మెల్సీ, ఎన్నికల జోనల్ ఇంఛార్జీ కేశవప్రసాద్ మాట్లాడుతూ… ‘‘బండి సంజయ్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. తెలంగాణ అంతటా ప్రచారం చేయాలి. కాబట్టి ఇకవపై మీ బూత్ లో మీరే బండి సంజయ్. మీరే ఇంటింటికీ అత్యధిక ప్రచారంతో గెలిపించాలి’’అని కోరారు. ‘‘కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి యుడ్యూరప్ప ఎన్నికల సమయంలో తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకేసారి వెళ్లి నామినేషన్ వేస్తారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తారు. పోలింగ్ బూత్ సభ్యులే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి యడ్యూరప్పను గెలిపిస్తారు. అందువల్లే యడ్యూరప్ప కర్నాటకలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణలోనూ బండి సంజయ్ కు అత్యంత ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.’’ అని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్