Tuesday, February 17, 2026

కాంగ్రెస్ ను గెలిపించిన బండి సంజయ్

- Advertisement -

సంజయుడే అధ్యక్షుడిగా బీజేపీ విజయం సాధించేది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన బీజేపీ ?

సంజయ్ ను తప్పించి కాంగ్రెస్ కు మేలు చేసిన కమలం

గౌరవప్రద స్థానాలు సాధిస్తామంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

మొన్నటిదాకా అధికారం ఖాయమంటూ ప్రకటనలు..

మొత్తమ్మీద ఈ ఎన్నికల్లో కమలం గెలిచేది 5-6 సీట్లే?

బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ కథే వేరు

ఆయనను తప్పించాక రేసులో బీజేపీ వెనుకబాటు

బీసీ సీఎం హామీ ఇచ్చినప్పటికీ బీజేపీని నమ్మని ప్రజలు

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. మరొక్క 36 గంటల్లో ఫలితాలూ వెలువడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఎగ్జిట్ పోల్స్ 24. వాటిలో 20 ఎగ్జిట్, ప్రీ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ కే అధికారం అంటూ చెబుతున్నాయి. ఇక బీఆర్ఎస్ మాత్రమే నాలుగంటే నాలుగే ఎగ్జిట్స్ పోల్స్ మొగ్గుచూపాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే .. 24  సర్వేలూ బీజేపీ గెలుస్తుందని మాత్రం చెప్పలేదు. కాకపోతే కమలం పార్టీ కొన్ని స్థానాలు మెరుగుపర్చుకుంటుందని చెబుతున్నాయి.

సంజయ్ కు కాంగ్రెస్ థ్యాంక్స్ చెప్పాలేమో..?

తెలంగాణలో మూడున్నరేళ్ల కిందటి వరకు బీజేపీ ఓ పార్టీ మాత్రమే. అలాంటి పార్టీని ముందువరసలోకి తీసుకొచ్చారు బండి సంజయ్. 2020 మార్చిలో ఆయన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిన్నర కాలం కొవిడ్ తోనే పోయింది. అయినా, మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు సంజయ్. తన పోరాట పటిమతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యమించారు. ఎక్కడికంటే అక్కడకు వెళ్తూ.. ప్రజా సమస్యలపై ఆందోళనలకు దిగుతూ.. బీజేపీని పైకి లేపారు. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రోస్ పార్టీకి సరైన నాయకత్వమే లేదంటే నమ్మాల్సిందే. కానీ, నాలుగు నెలల కిందట సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది బీజేపీ అధిష్ఠానం. ఆయన స్థానంలో ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన,కేంద్ర మంత్రిగానూ ఉన్న జి.కిషన్ రెడ్డిని నియమించింది. కాగా, కిషన్ రెడ్డి సౌమ్యుడు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టబడినవారే అయినా.. సంజయ్ తరహాలో దూకుడుగా ముందుకెళ్లలేని వ్యక్తి ఆయన. సరిగ్గా  ఎన్నికలకు ముందు ఆయనను నియమించడం, సంజయ్ ను తప్పించడం వెనుక బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లాలూచీగా చాలా మంది ఆరోపించారు. దీనిని పక్కనపెడితే.. ఎప్పుడైతే సంజయ్ రంగంలోంచి తప్పుకొన్నారో అప్పుడే బీజేపీ వెనుకబడిపోయి కాంగ్రెస్ పుంజుకుంది. అదే సమయంలో కర్ణాటక ఫలితాలు వెలువడి కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీని ఓడించి అధికారంలోకి రావడంతో హస్తానికి తెలంగాణలో ఊపు వచ్చినట్లయింది. ఈ పరిణామం తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తున్నదని సర్వేలు చెబుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ సంజయ్ కు థ్యాంక్స్ చెప్పాలనేది.

మొన్నటిదాక అధికారం.. నేడు గౌరవప్రదం

బీజేపీ జాతీయ పెద్దల నుంచి రాష్ట్ర నాయత్వం వరకు మొన్నటిదాక తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నట్లు చెప్పారు. కానీ,గురువారం పోలింగ్ ముగిశాక మాత్రం కిషన్ రెడ్డి మాటలో మార్పు వచ్చింది. రాష్ట్రంలో తాము గౌరవప్రద సంఖ్యలో సీట్లు నెగ్గుతామని పోలింగ్ అనంతరం ప్రకటించారు. దీనినిబట్టే బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో మూడో లేదా నాలుగో స్థానానికి పరిమితం కానున్నదని స్పష్టమవుతోంది.

సంజయ్ నే తప్పించాక.. బీ‘‘సీఎం’’ను ఎవరూ నమ్మలేదు

తెలంగాణలో బీజేపీని దాదాపు రెండోస్థానానికి తీసుకొచ్చిన సంజయ్ ను తప్పించిన బీజేపీ.. ఎన్నికల సమయంలో తాము గెలిస్తే బీసీ నాయకుడిని సీఎం చేస్తామంటూ ప్రకటించింది. కానీ, అంతటి సంజయ్ నే తప్పించిన బీజేపీ.. బీసీ సీఎం హామీని ఇచ్చినా ఎవరూ నమ్మలేదు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ అంటూ ప్రధాని మోదీ చేసిన హంగామానూ పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. ఇక ఎస్సీ వర్గీకరణ అంటే తెలుగు రాష్ట్రాల్లో తేనె తుట్టెను కదిలించడమే. ఇప్పటికైతే.. కమిటీ అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ, ఎన్నికల ఫలితం వచ్చాక ఏం చేస్తారనేది చెప్పలేం.

సంజయ్ ఉంటే ఆ కథే వేరు…

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండి.. ఎన్నికలలో పోటీ పడినట్లయితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి భిన్నంగా ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు. తన ఉద్యమాలు, పోరాటంతో పేరు తెచ్చుకున్న సంజయ్.. మీడియా సమావేశాల్లో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కీలక పాయింట్లను లేవనెత్తేవారు. అలాంటగి ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసి మొండికత్తితో తెలంగాణ ఎన్నికల్లో పోరాడింది బీజేపీ. అప్పటికీ సంజయ్ ను ఎన్నికల సమయంలో ముందుపెట్టింది. ఆయన తరచూ మీడియా సమావేశాలు నిర్వహించేలా చూసింది. కానీ, అధ్యక్ష బాధ్యతల్లో లేనందున అది ప్రాధాన్యం కాలేదు. మరోవైపు సంజయ్ కు కనీసం కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టడం తెలంగాణలో బలమైన మున్నూరు కాపు, బీసీ సామాజికవర్గాలను బీజేపీకి దూరం చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్