అల్లు అర్జున్ అరెస్టుపై బండి సంజయ్ మండిపాటు

- Advertisement -

అల్లు అర్జున్ అరెస్టుపై బండి సంజయ్ మండిపాటు

Bandi Sanjay's anger over Allu Arjun's arrest

హైదరాబాద్
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పై  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. మీ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు  అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా. పుష్ఫ-2 పాన్ ఇండియా సినిమా అని మీతోసహా ప్రపంచమంతా తెలుసు కదా? సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే కదా.  ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు ముందస్తు రక్షణ ఏర్పాట్లు తీసుకోలేదు? మీ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలైతే ఇతరులపై తప్పును నెట్టి శిక్షించాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ కు కనీసం సమయం ఇవ్వకుండా బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేయడం సిగ్గు చేటని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular