బండి సంజయ్ పాటల వీడియోలు విడుదల

- Advertisement -

బండి సంజయ్ పాటల వీడియోలు విడుదల:
ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి
Bandi Sanjay’s Song Videos Released:
Union Minister Sings RSS Anthems

కరీంనగర్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతాల వీడియోలు విడుదలయ్యాయి. గళమెత్తి పాడాలి, మాత్రుమూర్తి పదాల ముందర అనే రెండు పాటల వీడియోలను శుక్రవారం కరీంనగర్ విడుదల చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించి శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో బండి సంజయ్ ఈ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేశారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న బండి సంజయ్ చిన్ననాటి నుండి పాడేవారు. పలు అంతర్గత సమావేశాల్లో, సభల్లో సంజయ్ దేశభక్తి గీతాలు పాడేవారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ శతవసంతాలు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సన్నిహితుల సూచించడంతో బండి సంజయ్ ఈ గీతాలను విడుదల చేశారు. నిన్న ఈ వీడియోలకు సంబంధించి ప్రోమో విడుదలైన కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో వేలాది మంది భక్తులు, చిన్నారుల సమక్షంలో బండి సంజయ్ ఈ గీతాల వీడియోలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రచయిత ఆకుల నాగేశ్వర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular