తీవ్రమవుతున్న బెంగళూరు నీటి కష్టాలు
బెంగళూరు, మార్చి 20,
తాగునీటి కష్టాలతో దేశ ఐటీ రాజధాని బెంగళూరు అల్లాడిపోతోంది. భూగర్భ జలాలు పడిపోవడంతో అక్కడ బోర్లన్నీ ఇంకిపోయాయి. నదులు పిల్ల కాలువల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. చెరువులు ఎండిపోయాయి. బెంగళూరు నగరం మాత్రమే కాదు ఆ రాష్ట్రంలోని అన్ని తాలూకాల్లో తీవ్ర నీటి కష్టాలు ఉన్నాయి. నిన్నటిదాకా బెంగుళూరు నగరమే అనుకుంటే.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో మహానగరం వచ్చి చేరింది.ఐటి హబ్ బెంగళూరు నగరంలో నీటి కష్టాలు.. ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బదిలీ అయినట్టు తెలుస్తోంది. మంగళవారం ముంబై మహానగరంలో సరఫరా చేసే తాగునీటిలో పదిహేను శాతం కోత ఉంటుందని గృహం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. థానే జిల్లాలో పైస్ డ్యాంలో నీటిమట్టం పడిపోవడమే ఎందుకు కారణమని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అందువల్లే నీటి కోత విధిస్తున్నామని కార్పొరేషన్ అధికారులు తెలిపారుపైస్ డ్యామ్ కు మొత్తం 32 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. అందులో ఒక గేటుకు సంబంధించిన రబ్బర్ బ్లాడర్ గత డిసెంబర్ నుంచి పనిచేయడం లేదు. దీంతో ఆ డ్యామ్ నుంచి నీరు లీగ్ అవుతోంది. ఆ రబ్బర్ బ్లాడర్ సరి చేయాలంటే డ్యాం నీటిమట్టాన్ని 31 మీటర్లకు తగ్గించాలి. దీంతో డ్యాం అధికారులు ఆ నీటిని భట్సా జలాశయానికి తరలించారు. అనంతరం పైస్ డ్యాంలోని రబ్బర్ బ్లాడర్ కు మరమ్మతులు చేశారు. పంజర్ పోల్ వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ముంబై మహానగరానికి నీరు సరఫరా చేయడం సాధ్యం కాలేదు. దీనికి తోడు ఆ డ్యాం లో తగినంతగా నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేదు. ఫలితంగా గతంలో తరలించిన నీరు మొత్తం భట్సా జలాశయంలోనే ఉండిపోయింది. ఇక ముంబై నగరానికి భాండప్ ప్లాంట్ నుంచి నీటిని సరఫరా చేస్తారు. అయితే దానిని ప్రస్తుతం శుభ్రం చేయాల్సి ఉంది. అలాంటప్పుడు ముంబై మహా నగరానికి నీరు సరఫరా చేయడం సాధ్యపడదు. అందువల్ల ఐదు శాతం తాగునీటి సరఫరా లో కోత విధిస్తామని అధికారులు ఇదివరకే ప్రకటించారు. తాగునీటి కోతలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఉంటాయని తెలుస్తోంది.. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ముంబై నగరపాలక అధికారులు విఫలం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తీవ్రమవుతున్న బెంగళూరు నీటి కష్టాలు
- Advertisement -
- Advertisement -