- Advertisement -
కొమురంభీం ఆసిఫాబాద్: కాగజ్నగర్ రూరల్ పోలీసు స్టేషను పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో సరైన పత్రాలు లేని 99 లక్షల నగదును కాగజ్నగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు కు చెందిన నగదును, కాగజ్నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి రెబ్బెన తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ కు నగదును సిబ్ంది తీసుకెళ్తున్నారు. సదరు డబ్బులను ఆన్ లైన్ అప్లోడు చేయలేదని పట్టుకున్నారు. పత్రాలు ఉన్నప్పటికీ సుందా అనే ఆప్ లో అప్ లోడ్ లేకపోవడంతో సదరు నగదును స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -



