తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండుగ..!
- Bathukamma festival is a symbol of Telangana women’s self-respect..!
డాక్టర్ ప్రకాష్ రావు నగర్ 10వ వార్డ్ ఆన్నోజిగూడ లో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.
ముఖ్య అతిథిగా 10వ వార్డ్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్.
వాయిస్ టుడే న్యూస్, అక్టోబర్ 10 ఘట్కేసర్ :
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ కార్పొరేషన్ అన్నోజిగూడ పదవ వార్డ్ లో గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొంటున్నా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కాలనీలో ఘనంగా ఆటపాటలతో పిల్లలు, పెద్దలతో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పదో వార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్, మరియు మాజీ వార్డ్ నెంబర్ వెంకటేష్, కాలనీ అధ్యక్షులు కే. సూర్యకాంత్ రెడ్డి, సెక్రటరీ ఎస్. రఘు, ఉపాధ్యక్షులు సురేందర్ రావు, మహిళా ఉపాధ్యక్షురాలు స్వప్న, ట్రెజరర్ కార్తీక్, అభిషేక్, ఆనంద్, యాదగిరి, రాజు, చలపతి, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌన్సిలర్ బాలాగోని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. డాక్టర్ ప్రకాష్ రావు నగర్ పదవ వార్డ్ ఆడపడుచులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.