గిరి బలిజ లో బలిజను వెంటనే తొలగించి, జీ ఓ 5 ను వెంటనే రద్దు చెయ్యాలి –రాష్ట్ర కాపు జేఏసీ
బీసీరిజర్వేషన్ బలిజ కాపు వర్గాలకు అమలు పరచాలి త్వరలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఆమరణ దీక్ష చేస్తా..
అధ్యక్షులు చందు జనార్దన్
BC reservation should be implemented for the Balija Kapu communities. I will fast unto death on behalf of the State Kapu JAC.. President Chandu Janardhan

పుట్టపర్తి -సెప్టెంబర్ 23(మంగళవారం ) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీ ఓ 5 ను వెంటనే రద్దు చేయాలనీ గిరి బలిజ లో బలిజ ను తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ రాయలసీమ పర్యటన లో భాగంగా పుట్టపర్తి బలిజ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి మంగళవారం పుట్టపర్తి పట్టణం లో హాజరయ్యారు. ఈ సందర్బంగా చందు జనార్దన్ మాట్లాడుతూ దొమ్మరులను కూటమి ప్రభుత్వం గౌరవించడాన్ని బలిజ వర్గాలు స్వాగతిస్తాయి కానీ గిరి బలిజ పేరిట జీ ఓ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల వారి వంశం గా ఉన్న బలిజల్లో ఇతర కులాన్ని కలపడం బలిజలపై కూటమి ప్రభుత్వ దాడి గా బలిజలు భావిస్తారని విమర్శంచారు. తక్షణం జీ ఓ ను రద్దు చేసి గిరి బలిజ లో బలిజను తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ కోరారు. దశాబ్దాల కాలం నుండి బలిజ,కాపు వర్గాలు ఎదురుచూస్తున్న బీసీ రిజర్వేషన్ అంశాన్ని పూర్తి చేసి, న్యాయం చేయాలని, బలిజ,కాపు వర్గాల సమస్యల కోసం బీసీ రిజర్వేషన్ కోసం త్వరలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చందు జనార్ధన్ స్పష్టత నిచ్చారు. శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జే. ఏ. సి అధ్యక్షులు సోమ రౌతు రామకృష్ణ మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వంలో ఈ. డబ్ల్యూ. ఎస్. రిజర్వేషన్ మరియు బీసీ రిజర్వేషన్ కాపు, బలజ విద్యార్ధులకు అందుబాటులో లేకపోవడం వలన కనీసం ఐదు వేల వార్డ్ సెక్రటీస్ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. అదే నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ రిజర్వేషన్ అందుబాటులోకి రాకపోవడం వలన డీఎస్సీ పరీక్షల్లో 15 వందలమంది విద్యార్ధులు నష్టపోయారు. ఈ కార్యక్రమంలో పూల శివ ప్రసాద్,మార్కెట్ యార్డ్ చైర్మన్,జనసేన, సురేష్,పెనుమూరి కుమార్,హరి రాయల్,సురేష్ బాబు,బాల గంగాధర్ (బీజేపీ జిల్లా నాయకులు), బొగ్గరం శ్రీనివాసులు, కుంటిమిద్ది రామాంజనేయులు, ఎస్. రాము (జనసేన జిల్లా నాయకులు),దాసరి శ్రీనివాసులు,నాగిరెడ్డి (టీడీపీ జిల్లా నాయకులు), కావేటి మల్లికార్జున (బీజేపీ జిల్లా నాయకులు), ఏ.వెంకటేష్, ఎం.కరుణాకర్,చిట్టిబాబు, మంజునాథ్, ఎస్.గంగాధర్, వెంకటాద్రి,దాసరి శంకర్ తదితరులు పాల్గొన్నారు



