Sunday, September 8, 2024

అందుబాటులో ఉండి సేవలందించాలి

- Advertisement -

అందుబాటులో ఉండి సేవలందించాలి

Be available and serve

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల
గంభీరావుపేట సీహెచ్ సీ తనిఖీ..
ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలి
ముస్తాబాద్, పోత్గల్ పీఏసీఎస్ ల తనిఖీలో జిల్లా కలెక్టర్
సకాలంలో స్పందించి పాపను దవాఖానకు తరలించిన జిల్లా కలెక్టర్
వైద్యులు అందుబాటులో ఉండి.. సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేటలోని సీహెచ్ సీని, శుక్రవారం ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ఐపీ, లేబర్ రూం, ఫార్మసీ, ల్యాబ్ టాయిలెట్స్ ప్రహరీ, జనరేటర్, డ్రైనేజీ పరిశీలించి, వైద్యులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కేసులు వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
దవాఖానలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంకా కావాల్సిన వసతుల పై ఆరాతీశారు. ఆయా పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్, పోత్గల్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పీఏసీ ఎస్. లలో ఈ – పాస్ యంత్రాలను, నిల్వ ఉన్న యూరియా స్టాక్ ను పరిశీలించారు. ఎరువులు ఎంత ధరకు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా స్టాక్ ఉండాలని ఆదేశించారు.
పీఏసీఎస్. పరిశీలన అనంతరం కలెక్టర్ తన వాహనంలో వెళ్తుండగా ఒక పాపతో మహిళ వాహనానికి అడ్డుగా వచ్చారు. దీంతో కలెక్టర్ వాహనం నుంచి వెంటనే దిగి ఆమె వివరాలు అడిగారు.తన తన పాపకు తీవ్రమైన జ్వరం వచ్చిందని అలాగే ఫిట్స్ కూడా ఉన్నాయని సహాయం అందించాలని వేడుకోగా, స్పందించిన కలెక్టర్ వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి తరలించారు. అక్కడే కొద్ది సమయం ఉండి వైద్యులతో మాట్లాడారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు  పాప జ్వరం, ఫిట్స్ తో బాధపడుతుందని వైద్యులు తెలిపారు. సకాలంలో కలెక్టర్ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించడంతో పాపకు ప్రాణా పాయం తప్పింది.
ఈ  పర్యటన లో డీసీహెచ్ ఎస్. మురళీధర్ రావు, డాక్టర్లు శ్రీనివాస్, సిందూజ, నర్సులు, సిబ్బంది,జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, పీఏసీఎస్ సిబ్బంది, రైతులుతదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్