డబ్బు సంచులతో వస్తున్న బెంగళూరు బ్రదర్స్ కు బుద్ధి చెప్పండి

- Advertisement -

భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి

భువనగిరి నవంబర్ 21: డబ్బు సంచులతో వస్తున్న బెంగళూరు బ్రదర్స్ కు  ప్రజలు బుద్ధి చెప్పాలని భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు భువనగిరి మండలం వడాయి గూడెం గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లోఆయన పాల్గొన్నారు.బిజెపి ఎన్నికల మేనిఫెస్టో మరియు తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత భువనగిరి నియోజకవర్గంలో చేసే అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బిజెపి నేతృత్వం నేతృత్వంలో డబ్బులు ఇంజన్ సర్కార్ ఏర్పడడం ఖాయమని అంచనాలకు మించి బిజెపికి అన్ని వర్గాల ఆదరణ లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా రైతులు ఎస్సీలు బలహీన వర్గాలు కలిసి రావడం బీజేపీకి శుభ పరిణామం అని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, వాడయిగూడ గ్రామ సీనియర్ బిజెపి నాయకుడు సురేష్ గౌడ్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular