సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్
Be careful of seasonal diseases
జగిత్యాల,
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉందని ప్రజలందరూ జగ్రత్తగా ఉండాలని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ సూచించారు.
జగిత్యాల అర్బన్ మండలం లోని శంకులపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ పరిసరాల పరిశుభ్రత పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉప వైద్యాధికారి మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో అనవసర నీటి నిలువలు ఉన్నచో దోమల వృద్ధి జరుగునని వాటి ద్వారా విష జ్వరాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయిని ఈ సందర్భంగా తెలిపారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరు వేడి నీటిని చల్లార్చి తగలన్నారు పరిసర ప్రాంతాల్లో వర్ష కారణంగా నీటినిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు గ్రామాల్లో ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అన్నారు వ్యాధుల పట్ల అనుమానం వస్తే వెంటనే డాక్టర్ కు సంప్రదించాలన్నారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాల్లో వెళ్ళొద్దన్నారు. వర్షాకాలం వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపవైద్యాధికారి అన్నారు.