- Advertisement -
శ్రీకాకుళం: సంతబొమ్మాలి మండలం మేఘవరం పంచాయతీ పాత మేఘవరం, మరువాడ పంచాయతీ డి.మరువాడ మధ్యన సముద్ర తీరానికి అరుదైన చేప బారీ చనిపోయిన నీలి త్రిమంగళం ( బ్లూ వేల్ ) గురువారం కొట్టికొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు. అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో ఇది ఒకటి. అయితే ఇది సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడం వలన ఇది ఆ జాతి చేప పిల్లగా భావిస్తున్నారు.
- Advertisement -