వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ విజ యసా యిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి.
Being a tribal woman, she is being pulled on the road
గిరిజన మహిళ కాబట్టే తనను రోడ్డుకు లాగుతున్నా రంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను విదేశాల్లో ఉన్న సమ యంలో శాంతి గర్భవతి అయి బిడ్డను కన్నది అని, అందు కు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కారణం అని అను మాని స్తున్నట్టు శాంతి మాజీ భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి సంచలన ఆరోప ణలు చేశారు. అంతే కాకుండా ఆమె పనిచేస్తున్న దేవదాయ శాఖ కమిష నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. రెండు రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో, తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు.తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని కేవలం డబ్బుల కోసమే మదన్ మోహన్ చేస్తున్న కుట్ర అని శాంతి ఆరోపించా రు. తనకు మదన్ మోహన్ తో 2013లో వివాహం జరిగిందని తాను హిందవు కాగా మదన్ మోహ న్ క్రిస్టియన్ కావడంతో తనను మతం మార్చుకోవాలని హింసించే వాడని ఆరోపించారు. తాను పెద్దమ నుషుల సమక్షంలో 2016లో విడా కులు తీసుకున్నట్టు శాంతి స్పష్టం చేశారు. బాండ్ పేపర్ పై ఇద్దరం విడాకులు తీసు కున్నామని, అప్ప టికే తనకు ఇద్దరు కవల ఆడ పిల్లలు కలగడంతో చెరొక బిడ్డ సంరక్షణ తీసుకున్నామని శాంతి తెలిపారు. అయితే తన దగ్గర ఉన్న ఆడపిల్లను చంపేయా లని మదన్ మోహన్ బెదిరించేవాడని.. విడాకులు తీసుకు న్నా తనను వేధించేవాడు అని ఆమె ఆరోపించారు. తన పిల్లలు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో వారికోసం తాను మదన్ మోహన్ పెట్టే బాధలు భరించినట్టు చెప్పుకొచ్చారు.



