- Advertisement -
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఛైర్మన్ రాంబాబు, పండితులు గురువారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములకు అందజేసారు. ఉత్సవాలను ప్రారంభించి, అమ్మవారి తొలి దర్శనం చేసుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -


