28.7 C
New York
Sunday, June 23, 2024

నటి హేమకు మరోసారి బెంగళూరు పోలీసుల నోటీసులు జారీ

- Advertisement -

నటి హేమకు మరోసారి బెంగళూరు పోలీసుల నోటీసులు జారీ
బెంగళూరు మే 29 (
టాలీవుడ్‌ నటి హేమకు మరోసారి బెంగళూరు పోలీసుల నోటీసులు జారీ చేశారు. రేవ్‌ పార్టీ కేసులో జూన్‌ 1న విచారణకు హాజరుకావాలంటూ సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగుళూరు రేవ్‌ పార్టీలో ప్రముఖ తెలుగు నటి హేమతోపాటు పలువురు నటులు పాల్గొన్న సంగతి తెలిసిందే. నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. దాదాపు 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించి పరీక్షించింది  ఈ రక్త నమూనాలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు.. మొత్తం 86 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు నార్కోటిక్ టీమ్ వెల్లడించింది.  ఈ క్రమంలో నటి హేమ సోమవారం బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావల్సి ఉంది. అయితే హేమ పోలీసుల ముందు హాజరు కాకుండా వారికి ఒక లేఖ రాశారు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని చెప్పిన నటి హేమ ఇప్పుడు తాను విచారణ కు హాజరు కాలేనని లేఖలో రాశారు. దీంతో మళ్లీ ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!