వ్యక్తిగత పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం
Better health with personal hygieneహమారా శౌచాలయ్ – హమారా సమ్మాన్ వారోత్సవాలు నిర్వహణ
తుగ్గలి
వ్యక్తిగత పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్యం ఉంటుందని తుగ్గలి ఎంపీడీవో విశ్వ మోహన్,ఎంపీపీ ఎర్ర నాగప్ప,జడ్పిటిసి పులికొండ నాయక్ లు తెలియజేశారు. బుధవారం రోజున స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు హమారా శౌచాలయ్ – హమారా సమ్మాన్ వారోత్సవాల కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.ఈ వారోత్సవాల సందర్భంగా తుగ్గలి మండలం నందు తుగ్గలి గ్రామంనకు చెందిన హరిజన రత్నమయ్య,ఎద్దులదొడ్డి గ్రామంనకు చెందిన రవి,రాంకొండ పంచాయతీకి చెందిన ప్రసన్న రాణి లను వారు ఘనంగా సన్మానించారు.వ్యక్తిగత మరుగుదొడ్డి,వ్యక్తిగత పరిశుభ్రతను సక్రమంగా పాటిస్తున్నందుకు గాను వీరిని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు మండల అధ్యక్షులు ఎర్ర నాగప్ప,జడ్పిటిసి పులికొండ నాయక్,ఎంపీడీవో విశ్వ మోహన్ శాలువాను కప్పి పూలదండలు వేసి వారిని సన్మానించారు.ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని వారు తెలియజేశారు.అదేవిధంగా ప్రజలు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏవో భాష,జూనియర్ అసిస్టెంట్ రామ్ రామ్, కార్యాలయ సిబ్బంది వినోద్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




