అకాల వర్షాలు జాగ్రత్త
హైదరాబాద్, మార్చి 28, (వాయిస్ టుడే)
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వారం రోజుల పాటు అక్కడక్కడా అకాల వర్షాలు కురిశాయి. అయితే వారం రోజుల అనంతరం నేటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ నమోదు అవుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో 15 జిల్లాలకు 41 నుంచి 44 డిగ్రీల వవరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ఆయా జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే కొద్ది రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వివరించింది.ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.పలు జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 40.9 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో 40.9 డిగ్రీల సెల్సియస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40.7 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లాలో 40.6 డిగ్రీల సెల్సియస్, నిర్మల్ జిల్లాలో 40.5 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల జిల్లాలో 40.4 డిగ్రీల సెల్సియస్, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 40.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వివరించింది.హైదరాబాద్ మహానగరం, అలాగే పక్కన జిల్లాలతో సహా ఇతర ప్రాంతాలలో 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పుడే ఇలా ఎండలు దంచికొడుతుంటే మున్ముందు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మే మాసంలో కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని, తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 2-3 డిగ్రీల అదనపు పెరుగుదల ఉండొచ్చని అధికారులు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ భారీ ఎండల నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువ నీరు తాగాలని, మధ్యాహ్న సమయంలో బయట రావొద్దని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అకాల వర్షాలు జాగ్రత్త

- Advertisement -
- Advertisement -