బ్రహ్మోత్సవాలకు సిద్ధమౌతున్న భద్రాచలం
ఖమ్మం, ఏప్రిల్ 2, (వాయిస్ టుడే)
Bhadrachalam is preparing for Brahmotsavam
దక్షిణ అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. రామయ్య కల్యాణం ఊరూవాడా నిర్వహించినా కానీ భద్రాచలంలో జరిగే వేడుక ప్రత్యేకతే వేరు. 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే భక్తురాలు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో తాటాకు పందిరి వేసి స్వామివారికి పూజలు చేసింది. ఆ ప్రాంతంలోనే కంచర్ల గోపన్న 1674లో ఆలయాన్ని నిర్మించారు.
స్వామివారి దర్శన వేళలు
@ తెల్లవారుజామున 4.30 గంటలకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలుపుతారు…ఈ సేవలో పాల్గొనాలి అనుకుంటే రూ.200 టికెట్
@ ఉదయం 5.30 నుంచి 7.00 గంటల వరకు బాలభోగం నివేదిస్తారు
@ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు సహస్ర నామార్చన – ఈ సేవకు దంపతులకు ప్రవేశం ఉంటుంది. టికెట్ రూ. 200
@ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు
@ మధ్నాహ్నం 3 నుంచి రాత్రి 9.30 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు
@ రాత్రి 7 గంటలకు దర్బారు సేవ జరుగుతుంది.. ఈ సేవను చూసేందుకు రూ.100 టికెట్ పై ప్రత్యేక దర్శనం ఉంటుంది
@ టికెట్లు లేనివారుంటే పడమర మెట్లవైపు నుంచి రాజగోపురం గుండా మూలవిరాట్టును దర్శించుకోవచ్చు. స్థానికులకు మంగళ, బుధ, గురువారాల్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు తమ గుర్తింపు కార్డుతో 100 రూపాయల టికెట్ మార్గంలో ఉచిత దర్శనం చేసుకోవచ్చు.
@ పర్ణశాల సందర్శించే భక్తులకు 60 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటూ చంటి పిల్లల తల్లులకు, దివ్యాంగులు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. భద్రాచలం నుంచి TGSRTC బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో చేరుకోవచ్చు.
@ ప్రముఖుల ప్రొటోకాల్ దర్శనాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే పూజల వివరాలన్నీ మొత్తం ఆన్‌లైన్‌లో (https:bhadradritemple.
@ రూ.100 టికెట్‌పై ఉదయం 7 గంటలకు (ఆదివారం మినహా) భద్రుడి మండపంలో నిర్వహించే అభిషేకంలో పాల్గొనవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం 7 నుంచి 8 వరకు మూలవరుల అభిషేకంలో రూ.1,500 టికెట్‌పై పాల్గొనవచ్చు.
@ ప్రతి మంగళవారం ఉదయం 8.30కి ఆంజనేయుడికిస్వామి అభిషేకంలో, ప్రతి శుక్రవారం ఉదయం 8.30 గంటలకి లక్ష్మీతాయారు అమ్మవారికి నిర్వహించే అభిషేకంలో, శనివారం శ్రీయోగానంద లక్ష్మీ నరసింహ స్వామి అభిషేకంలో ఒక్కోదానికి రూ.100 టికెట్‌పై పాల్గొనవచ్చు.
శాశ్వత సేవలు
15,000 చెల్లించి ఏడాదిలో సీతారాముల కల్యాణంలో పాల్గొనవచ్చు ( శ్రీరామనవమి మినహా)
3 లక్షలు చెల్లించి వస్త్రాలంకరణ సేవలో పాల్గొనవచ్చు
15 వేలు చెల్లించి ఏడాదిలో ఓసారి పుష్యమి నక్షత్రం రోజున శాశ్వత పట్టాభిషేకం చేయించవచ్చు
1,116 చెల్లించి అన్నదానం, 5,116 చెల్లించి భక్తులకు ప్రసాద వితరణ చేయించవచ్చు
భద్రాచలం వెళ్లే భక్తులకు వసతి సౌకర్యాల విషయానికొస్తే..రామాలయానికి 200 రూములు – నాన్ ఏసీ రూమ్స్ కి రోజుకి 448 నుంచి 896 … ఏసీ రూమ్స్ కి రూ.1,456, కాటేజీకి రూ.2,240 ఉంది. వీటిని ఆన్‌లైన్‌లో కానీ నేరుగా కానీ బుక్ చేసుకోవచ్చు