Sunday, September 8, 2024

ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు

- Advertisement -

ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు
ఖమ్మం, ఏప్రిల్ 15
: భద్రాద్రి రామయ్య భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రామయ్య కల్యాణ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికే అందజేసేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 17న (బుధవారం) శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్ సైట్ https://www.tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలు బుక్ చేసుకోవాలని తెలిపారు. అలాగే, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే వారు 040 – 23450033, 040 – 690000, 040 – 694400669 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 18 వరకూ బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఇలా బుక్ చేసుకోండి
☛ రాములోరి కల్యాణ తలంబ్రాల బుకింగ్ ను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం సైట్ లో అందుబాటులో ఉంచారు. తొలుత https://www.tsrtclogistics.in కు వెళ్లి.. తలంబ్రాలు బుకింగ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
☛ ఆ తర్వాత మీ చిరునామా, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత తలంబ్రాలు ఎన్ని ప్యాకెట్లు కావాలో ఎంచుకోవాలి. ఒక్కో ప్యాకెట్ ధర రూ.151గా నిర్ణయించారు.
☛ అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. యూపీఐ ద్వారా పేమెంట్ చెయ్యొచ్చు.
☛ పేమెంట్ చెల్లించిన తర్వాత బుకింగ్ సక్సెస్ అయినట్లు ఓ ట్రాన్సాక్షన్ నెంబర్ తో ఆర్టీసీ నుంచి ఓ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ చిరునామాకు కల్యాణ తలంబ్రాలు వస్తాయి.
☛ అటు, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ల నెంబర్లైన 040 – 23450033, 040 – 690000, 040 – 694400669ను సంప్రదించి వివరాలు తెలపాలి.
భారీ ఏర్పాట్లు
మరోవైపు, భద్రాచలం రాములోరి కల్యాణ వేడుక కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న నిర్వహించే కల్యాణ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టారు. ఏటా మిథిలా స్టేడియంలో సుమారు 20 వేల మంది ఒకేసారి సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించేలా వేడుక జరుగుతుంది. అటు, దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక టికెట్ల ద్వారా కల్యాణాన్ని దగ్గరగా వీక్షించొచ్చు. రూ.150, రూ.300, రూ.1000, రూ. 2 వేలు, రూ.2,500, రూ.7,500 విలువైన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 17న రామయ్య కల్యాణం, ఏప్రిల్ 18న పట్టాభిషేకం, ఏప్రిల్ 19 న హంస వాహన సేవ, ఏప్రిల్ 20న తెప్పోత్సవం – అశ్వవాహన సేవ, 21న ఊంజల్ ఉత్సవం – సింహ వాహన సేవ, 22న వసంతోత్సవం – గజ వాహన సేవ నిర్వహించి.. ఏప్రిల్ 23న చక్రతీర్థం, పూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్