- Advertisement -
బెంగళూరు నుంచి మించిపోతున్న భాగ్యనగరం
Bhagyanagara surpassing Bangalore
హైదరాబాద్, అక్టోబరు 24, (వాయిస్ టుడే)
ఐ టీ పరంగానూ హైదరాబాద్ బెంగళూరు తరువాత టాప్ ప్లేసులో కొనసాగుతోంది. అయితే.. బెంగళూరులో బతకలేని ఓ మాదిరి ఉద్యోగి కూడా హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ కోరుకున్నాడు. అది మొన్నటివరకు అని మాత్రమే చెప్పాలి. ఒకప్పుడు బెంగళూరులో అద్దెలు చూసి భరించలేకపోయిన ఉద్యోగులు.. ఇప్పుడు వచ్చాక కూడా ఇవేమి అద్దెలురా బాబోయ్ అని అరవాల్సిన పరిస్థితి వచ్చింది.వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ టాప్ ప్లేసులో నిలుస్తోంది. భాగ్యనగరంగా పేరొందిన హైదరాబాద్.. నిజంగానే పేదల పాలిట భాగ్యాలు పంచుతోంది. సామాన్యులకు కేరాఫ్ అడ్రస్ అయింది. అందుకే.. నిత్యం గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏటా హైదరాబాద్ విస్తీర్ణం కూడా అంతకంతకూ పెరుగుతోంది. హైదరాబాద్‌కు చేరుకుంటే ఏదో ఒక ఉపాధి చేసుకొని అయినా బతకొచ్చు అనే ధీమా వచ్చింది. అటు యువత కూడా జాబ్స్ కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. జిల్లాల్లో కొలువులు చేయడానికి ఇష్టపడకుండా మహానగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే హైదరాబాద్ జనాభాలో సామాన్యులే అధిక శాతం అనేది చెప్పక తప్పదు. ఇక్కడ నెలకు పది వేలు సంపాదించినా బతకొచ్చు.. పది లక్షలు సంపాదించినా బతకొచ్చు. అయితే.. ఇప్పుడు మహానగరంలో కూడా జీవన యానం కాస్త పిరం అయింది.ఐటీ పరంగానూ హైదరాబాద్ బెంగళూరు తరువాత టాప్ ప్లేసులో కొనసాగుతోంది. అయితే.. బెంగళూరులో బతకలేని ఓ మాదిరి ఉద్యోగి కూడా హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ కోరుకున్నాడు. అది మొన్నటివరకు అని మాత్రమే చెప్పాలి. ఒకప్పుడు బెంగళూరులో అద్దెలు చూసి భరించలేకపోయిన ఉద్యోగులు.. ఇప్పుడు వచ్చాక కూడా ఇవేమి అద్దెలురా బాబోయ్ అని అరవాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌లో కూడా అద్దెలు భరించలేని స్థాయికి చేరాయి. కాస్త రిచ్ అపార్టుమెంట్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కనీసం 40 వేల నుంచి 50వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు. మామూలు అపార్ట్మెంట్లలో 20వేలకు తక్కువ లేదు. శివారు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోనూ మెయింటనెన్స్‌తో కలుపుకుని 20వేలకు చేరుతోంది. ఇండిపెండెంట్ ఇళ్లకు వచ్చేసిరికి చిన్నిచిన్న పోర్షన్లకు కూడా పది నుంచి పది వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక సింగిల్ రూముల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఒక్క రూము రెంటు కూడా 6వేలకు పైగా పలుకుతోంది. దాంతో సామాన్యులు ఇల్లు అద్దెకు తీసుకొని బతికే పరిస్థితి లేకుండా పోయింది. అందులోనూ వలస వస్తున్న జనాభాకు తగినట్లుగా తక్కువ రేట్లలో ఎక్కడా ఇళ్లు కనిపించడం లేదు. ఫలితంగా చాలా మంది స్లమ్‌లలో జీవిస్తూ కనిపిస్తున్నారు. డే అంతా ఏదో ఒక ఉపాధి పొందుతూ రాత్రి పూట స్లమ్‌లలో కాలం వెళ్లదీస్తున్నారు.అయితే.. కరోనా సమయంలో హైదరాబాద్‌లోని ఏ వీధిలో చూసినా టూలెట్ బోర్డులే కనిపించేవి. అంతా ఇళ్ల బాట పట్టడంతో ఆ సమయంలో సగానికి పైగా అద్దెలు పడిపోయాయి. చాలా వరకు ఇళ్లు ఖాళీ అయ్యాయి. దాంతో కాస్త అద్దెల్లో మార్పు వచ్చింది. సింగిల్ బెడ్ రూమ్‌కు వసూలు చేసే అద్దెతో డబుల్ బెడ్‌రూమ్ కూడా ఇచ్చేశారు. ఇక.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌కు వలసలు పెరగడంతో మరోసారి ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఖాళీ పోర్షన్లే కనిపించడంలేదు. దాంతో అద్దెలు భగ్గుమంటున్నాయి. కరోనాకు ముందు పరిస్థితిని మించి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులను చూసి బెంగళూరు నుంచి వలస వచ్చిన వారంతా ఇక్కడితో పోల్చితే అక్కడే బాగుండేనే అనే అభిప్రాయానికి వచ్చారు. సగటు 35వేల జీతం వచ్చే ఉద్యోగి కూడా వేతనంలో నుంచి పది వేలు అద్దెకు చెల్లించాల్సి వస్తోంది. ఇది పోను ఈఎంఐలు, చిట్టీలు తదితరాలతో మళ్లీ నెల వచ్చేసరికి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తోంది.
- Advertisement -