స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు భారతరత్న
Bharat Ratna to late former Prime Minister Manmohan Singh
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్
దేశానికి మన్మోహన్ సింగ్ విశిష్టమైన సేవలు అందిం చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. నిర్మాణాత్మక సంస్కరణల అమలులో మన్మోహన్ సింగ్‌ది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టింది మన్మోహన్ సింగ్, నాయకత్వమేనని. తెలంగాణకు మన్మోహన్ సింగ్, ఆత్మ బంధువని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు 4 కోట్ల మంది తరఫున నివాళులర్పిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ సింగ్ స్థానం శాశ్వతమని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు. మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా. ఆయన తన సహనాన్ని కోల్పోలేదు. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టిసారించారు.
ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారు.
ఇది మాకు జీవిత కాలం గుర్తుండిపోయే అని రేవంత్ వ్యాఖ్యానించారు.