- Advertisement -
లాస్ వేగాస్ మైన్ ఎక్స్ పో లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka, Deputy CM in Las Vegas Mine Expoహైదరాబాద్
అమెరికాలోని లాస్ వేగాస్ మైన్ ఎక్స్ పో లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గోన్నారు. మైన్ ఎక్స్ పోలో 2 వేలకు పైగా ఆధునిక యంత్ర తయారీ సంస్థలు పాల్గోంటున్నాయి. 121 దేశాల నుండి 40 వేల మంది ప్రతినిధులు పాల్గోన్నారు. మూడు రోజుల ప్రదర్శనలో అత్యాధునిక, భారీ మైనింగ్ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు వుంచారు. తెలంగాణ లో మైనింగ్ లో ఆధునిక సాంకేతికత వినియోగం.. ఇతర రంగాల్లో అవకాశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో అధ్యయనం చేయనున్నారు. డిప్యూటీ సీఎం వెంట ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇతర అధికారులు వున్నారు. మైనింగ్ సాంకేతికతలపై అధ్యయనానికి తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి బృందం ఈ కార్యక్రమానికి హజరయింది.
- Advertisement -




