ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం

- Advertisement -

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
విజయనగరం, జూలై 20,

Bhogapuram Airport to be inaugurated on August 1.
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఇటీవల ఎయిర్ పోర్ట్ నిర్మాణ చివరి దశ పనులు సైతం పూర్తయ్యాయి. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ.. ఉత్తరాంధ్ర.. ఉత్తమాంధ్రగా నిలిచేందుకు ముహూర్తం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఓ ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అవుతున్న సమయంలో.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా తమ మద్దతును అందివ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్, వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ఘనంగా జరిగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ పనుల పురోగతి, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక మణిహారం లాంటిది. ఇది ఈ ప్రాంతానికి సరికొత్త ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలను తీసుకువస్తుంది. భోగాపురం విమానాశ్రయం, పర్యాటక ప్రాజెక్టులు, పోర్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమల అనుసంధానంతో ఉత్తరాంధ్ర ఇకపై అన్‌స్టాపబుల్‌ గా దూసుకుపోతుందని దీమా వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్ట్ లోని ప్రతి విభాగం ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్
తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన భోగాపురం ఎయిర్ పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి…రెండేళ్ల కాలంలో పూర్తి చేసిందని చంద్ర‌బాబు చెప్పారు. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా భోగాపురం ఎయిర్ పోర్టులో నిర్మాణ వివరాలు, వసతులు, సౌకర్యాలను అధికారులు సీఎం చంద్ర‌బాబుకు వివరించారు. ఎయిర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం ఎయిర్ పోర్టు కీలకం కానుంది. సామాన్యుల జీవితాలను మార్చే విధంగా ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఎకనమిక్ యాక్టివిటీ ఉరుకులు పెడుతుంది. రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి. సామాన్యులు కూడా అనేక రకాలుగా లబ్ది పొందుతారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో ఈ ఎయిర్ పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్‌లో వచ్చిన శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు ఆ ప్రాంతంలో ఎటువంటి మార్పులు తెచ్చిందో నేడు భోగాపురంతో ఆ ప్రాంతంలోనూ అటువంటి మార్పులే తెస్తుంది.“ అని అన్నారు.“ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్ పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలి. ప్రధాని చేతుల మీదు జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలి. గిరిజన సంస్కృతి, హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలి. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భం. ప్రతి పౌరుడూ ఎయిర్ పోర్టును చూసి గర్వించే పరిస్థితి రావాలి. ఉత్తరాంధ్రలో దీన్ని పండుగలా చేసేలా ప్రజలను, విద్యార్థులను, యువతను భాగస్వాములను చేయాలి” అని సీఎ చంద్రబాబు ఆదేశించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular