తిరుమలలో బయో గ్యాస్ ప్లాంటుకు భూమి పూజ

- Advertisement -

తిరుమలలో బయో గ్యాస్ ప్లాంటుకు భూమి పూజ

Bhoomi Pooja for bio gas plant in Tirumala

తిరుమల,
ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి తిరుమలలోని కాకులమాను తిప్ప వద్ద బుధవారం ఉదయం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అడిషనల్ ఈవోశ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి భూమిపూజ చేశారు.

2.22 ఎకరాల్లో బయో గ్యాస్ ప్లాంటును ఐఓసీఎల్ నిర్మించనుంది. 0.17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు. రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని రూ.12.85 కోట్ల  అంచనా వ్యయంతో రూపొందించగా రూ.7.05 కోట్లు ఐఓసీఎల్, రూ.5.80 కోట్ల నిధులను టీటీడీ సమకూర్చనుంది.

ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే మిశ్రమ వ్యర్థాల ద్వారా బయో గ్యాస్ ను ఉత్పత్తి చేసి రెండున్నర కిలో మీటర్ల దూరంలోని తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైపు లైన్ ద్వారా పంపిణీ చేయనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular