27.7 C
New York
Thursday, June 13, 2024

జస్టిస్ పుంజాల శివశంకర్ మొదటి విగ్రహా ఏర్పాటుకై భూమి పూజ

- Advertisement -

జస్టిస్ పుంజాల శివశంకర్ మొదటి విగ్రహా ఏర్పాటుకై భూమి పూజ

ఈరోజు ముధోల్ తాలూకా కేంద్రం లో మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి , గవర్నర్ జస్టిస్ పుంజాల శివశంకర్ మొదటి విగ్రహా ఏర్పాటుకై భూమి పూజ చేయడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభినవ పూలే మాజీ కేంద్ర మంత్రివర్యులు గవర్నర్ జస్టిస్ పుంజల శివశంకర్ భారత దేశంలో మొట్టమొదటి విగ్రహానికి నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం ముధోల్ గ్రామంలో భూమి పూజ చేయడం జరిగింది బీసీ సంఘాలు మరియు బహుజన సంఘాల పెద్దలు మాట్లాడుతూ పుంజల శివశంకర్ చేసిన నిస్వార్థమైన కృషి వల్లనే ఈరోజు బీసీ ఉద్యోగాలపరంగా విద్య పరంగా అభివృద్ధి చెందడం జరిగింది బీసీ రిజర్వేషన్లు అధ్యుడు ఆయన చేసిన కృషి వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 27% రిజర్వేషన్లు అలాగే మండల కమిషన్ నివేదిక అందించడంలో ఆ సిఫార్సు అమలు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించడం వల్ల ఈరోజు భారతదేశంలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అందించడానికి కృషి చేయడం జరిగింది అదేవిధంగా కోర్టులలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ విధానాన్ని అమలు తీసుకురావడం జరిగింది విదేశాంగ విధానంలో ఆర్థిక కోణాన్ని అమలు చేసిన ఘనత కూడా పొందిన శివశంకర్ కి దక్కుతుంది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న బీసీల గురించి ఆలోచించిన నాయకుడు దేశంలో ఇంతవరకు లేరు, బహుజనులు మరియు బీసీలు అని పిలువబడే ప్రతి ఒక్కరు కూడా శివశంకర్ జీవితచరిత్రను ఆయనను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆయన చేసిన కృషిను కూడా గుర్తించి అతని స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన గౌరవము ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అందులోని ప్రధానాంశాలు

1. భారతరత్న కి అన్నివిధాలా అర్హుడు అయిన పుంజాల శివశంకర్ సేవలని గుర్తించాలి ప్రకటించాలి
2. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శివశంకర్ వర్ధంతి జయంతి అధికారికంగా నిర్వహించాలి
3. కేంద్ర జాబితాలో ఉన్న నల్సార్ లా యూనివర్సిటీ కి రాష్ట్ర ప్రభుత్వంలో నూతనంగా నిర్వహించబోతున్న నూతన హైకోర్టు భవనానికి పుంజుల శివశంకర్ అనే నామకరణం చేయాలిచేయాలి
4. పుంజుల శివశంకర్ పేదరికం నుండి అత్యున్నత స్థాయికి వెళ్లిన విధానాన్ని పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి
5. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పుంజుల శివశంకర్ విగ్రహాలు సుప్రీంకోర్టు హైకోర్టు పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టాలి
6. ⁠ట్యాంక్ బండు పై పుంజాల శివశంకర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి.

భూమి పూజ కార్యక్రమం లో రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇటిక్యాల వెంకటకిషన్ , TMKEA నిర్మల్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ సార్, TMKEA నిర్మల్ కార్యదర్శి బారే శ్రీనివాస్ , రిసెర్చి స్కాలర్ భారత పూలే జాగృతి చాదల లక్ష్మి నారాయణ, MK సీనియర్ తాలూకా అధ్యకులు రోళ్ల రమేష్ , ముధోల్ సర్పంచ్ రాజేందర్ , ఉపసర్పంచ్ సంజీవ్ ,BDC అధ్యక్షులు గుంజాల నారాయణ , సాయినాథ్ మేత్రి , PACS డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్ సార్ , మిత్ర మండలి భైంసా పెండెప్ కాశీనాథ్ , బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మల్లేష్ ,కిషన్ పతంగె సార్ ,సంగోళ్ళపోతన్న బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న , ఇంచార్జి తటివార్ రమేష్ , AEO మేకల రమేష్ భీం ఆర్మీ విశ్వంభర జోంధాలే , బారే శ్రీనివాస్ సార్ , అసరొళ్ల రాజేశ్వర్ , మసనోళ్ల గంగాధర్
, లవన్ భాస్కరోళ్ల , అంబెడ్కర్ యువజన సంఘం రాహుల్ , గ్రామస్తులు యువకులు పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!