భూంపల్లి, పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ,
Bhumpalli, Police Commissioner who visited Police Station Dr. B. Anuradha,
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, శుక్రవారం భూంపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ ఏరియాను, పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్ట్ 2 మ్యాప్ ను పోలీస్ స్టేషన్లో ఉండే మాల్ రూమును పరిశీలించారు. పోలీస్ సిబ్బంది కిట్ ఆర్టికల్ ను పరిశీలించి బాగుందని సిబ్బందిని అభినందించారు. మరియు రెస్ట్ రూమ్లను రికార్డ్ రూమ్ను పరిశీలించారు. మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు అప్పగించినందుకు ఎస్ఐని మరియు సిబ్బందిని అభినందించారు
ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలి
డయల్ 100 కాల్ కు వెంటనే రెస్పాండ్ కావాలి
విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి
విపిఓ వ్యవస్థను మరింత బలపరచాలి
ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్లతో తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు
గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేసి సమూలంగా నిర్మూలించాలి
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
అధికారులు సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వహించాలి విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదు
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
ఇసుక,జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ సిడి ఫైల్స్ తనిఖీ చేశారు ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని ఎస్ఐకి సూచించారు.
ఈ సందర్భంగా సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు
ప్రతి కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలని రిసెప్షన్ సూచించారు.
అంకితభావంతో విధులు నిర్వహించాలని,అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై విధులు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాల గురించి మరియు ప్రజలు ఎవ్వరూ సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. విపిఓ విలేజ్ పోలీస్ ఆఫీసర్ బుక్స్ తనిఖీ చేశారు, గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తుపదార్థాల వల్ల కలిగే పర్యవసానాల గురించి గురించి స్కూల్ లలో కాలేజీలలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలు అమ్మే వారిపై సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచివేయాలని తెలిపారు. గ్రామాలలో మండల కేంద్రంలో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహించే వారిపై నిఘా పెంచాలని తెలిపారు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని సూచించారు.
పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించి ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకోవాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. నూతన చట్టాల గురించి గ్రామాలలో మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. సిబ్బంది యొక్క సాధక బాధలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్ రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
స్కూళ్లు కాలేజీలు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో పనిచేయని సీసీ కెమెరాలు గురించి సంబంధిత వ్యాపారులు ప్రజాప్రతినిధులతో కలసి నేను సైతం ద్వారా రిపేర్ చేయించాలి, మరియు కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్టికల్ వారిగా విధులు నిర్వహించే సిబ్బంది గురించి అడిగి తెలుసుకుని తగు సూచనలు సలహాలు చేశారు ప్రతి సమాచారాన్ని ఆన్లైన్ చేయాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ లో డాటా ను ఏ రోజు కా రోజు అప్డేట్ చేయాలని సూచించారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరగా డిస్పోజల్ చేయాలని తెలిపారు. విధినిర్వహణలో పోటీపడి విధులు నిర్వహించే వారికి ప్రతి నెల రివార్డులు అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమూలంగా నిర్మూలించాలని తెలిపారు. పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కోర్టు లైజనింగ్ ఇన్స్పెక్టర్ కమలాకర, భూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్, సీసీ నితిన్ రెడ్డి,
భూంపల్లి హెడ్ కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, బాబు, రవీందర్, వెంకటేశ్వర్లు,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.