- Advertisement -
యదాద్రి భువనగిరి నవంబర్ 8: భువనగిరి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి బుదవారం నామినేషన్ వేసారు..ఈ సందర్భంగా గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల తర్వాత భువనగిరి ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేయ్యాబోతున్నమని, బీ ఆర్ ఎస్ పాలన, స్థానిక ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కి ప్రజలే బుద్ది చెబుతారని, పదో తారీఖు రోజున మరో నామినేషన్ ను బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తో వెళ్లి నామినేషన్ వేస్తామని అన్నారు.వీరితొ పాటు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు,యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల ఇంఛార్జి సోము వీర్రాజు, శ్రీకాంత్, బిజెపి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ ఉన్నారు.
- Advertisement -



