భువనగిరి ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కు టికెట్ కేటాయించాలి…..
తీన్మార్ మల్లన్న టీం జనగామ జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారి
జనగామ జిల్లా పాలకుర్తి :
ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు భువనగిరి ఎంపీ ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించాలని తీన్మార్ మల్లన్న టీం జనగామ జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి అహర్నిశలు కష్టపడి టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించి అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై ప్రజా శ్రేయస్ కోసం నిత్యం ప్రజల కోసమే ప్రశ్నించే గొంతు గా మరి టిఆర్ఎస్ పార్టీని ఎండగట్టిన వ్యక్తిగత తీన్మార్ మల్లన్న చరిత్రలో నిలిచిపోయారు అనునిత్యం ప్రజలు కష్టపడే వ్యక్తికి ఎంపీ టిక్కెట్ లేదా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని తీన్మార్ మల్లన్న టీం నినాదాలు చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే మనిషికి టికెట్ ఇవ్వకపోతే ప్రజాస్వామ్యాన్ని చంపినట్టేనని కాసోజు బ్రహ్మచారి అన్నారు. తీన్మార్ మల్లన్న సేవలు అధికార పార్టీ గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు టిఆర్ఎస్ పై యుద్ధం చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయభ్రాంతులకు గురి చేసిన టిఆర్ఎస్ పార్టీ దాడులకు దిగి ప్రాణభయాన్ని గుర్తుచేసిన ఎక్కడ తల వంచక ప్రజల కోసమే తన శ్రమ అని తన ఊపిరి ఉన్నంత సేపు ప్రజల కోసం పని చేస్తానని ప్రజల కోసం నిలబడతానని చేసిన వాగ్దానానికి తన గుండె ధైర్యానికి ఎంపీ టికెట్టు కేటాయించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో ప్రజా సమస్యలను తీసుకువెళ్లాలన్నా ఇంతటి వ్యక్తినైనా ప్రశ్నించే వ్యక్తిగా తను ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని జర్నలిజం అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ప్రజలకు అధికారులకు మధ్య వారిదిగా నిలిచి ఎప్పుడో తను ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయాడని ఆయన అన్నారు. రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో ప్రజా సమస్యలను గుర్తించిన ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న అని కొనియాడారు. అదేవిధంగా ఈ సందర్భంగా తనకు ఎంపీ టికెట్ కేటాయించే వరకు తీన్మార్ మల్లన్న టీం పోరాడుతామని హెచ్చరించారు.