Wednesday, March 11, 2026

కడియం, దానంలకు బిగ్ రిలీఫ్

- Advertisement -

కడియం, దానంలకు బిగ్ రిలీఫ్
హైదరాబాద్, మార్చి 11

Big Relief for Kadiyam and Danam
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అనర్హత పిటిషన్లు హాట్ టాఫిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వగా.. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఊరట దక్కింది. పిటిషన్లపై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవంటూ వాటిని డిస్మిస్ చేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. మార్చి 12లోగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, తాజాగా ఇద్దరితో కలిపి మెుత్తం 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, కాలెయాదయ్య, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారినట్లు మీడియాలో కథనాలు రావటంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద మరికొందరు సభ్యులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ సకాలంలో చర్యలు తీసుకోకపోవటంతో తెలంగాణ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు స్పీకర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్చి 12లోగా విచారణ జరిపి నిర్ణయాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గతంలోనే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా.. దానం, కడియంలపై ఇచ్చిన పిటిషన్లను సైతం కొట్టేశారు.అయితే వీరిలో దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ స్పీకర్ మాత్రం అనుహ్యంగా దానం నాగేందర్కు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని అంటున్నారు. వాళ్లు పార్టీ మారకపోతే బీఆర్ఎస్ భవన్కు రావాలని సవాల్ విసురుతున్నారు. కాగా, స్పీకర్ నిర్ణయంపై దానం హర్షం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా తనను మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. తాను సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయటం పూర్తిగా తన వ్యక్తిగతమని అన్నారు. ప్రాథమిక హక్కును ఉపయోగించుకోనే పోటీలో నిలిచినట్లు చెప్పుకొచ్చారు.
ఒక రోజు ముందే
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు. దానం, కడియంలపై తాజాగా వాదనలు పూర్తికాగా.. నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండగా.. ఒకరోజు ముందే.. స్పీకర్ కడియం, దానం నాగేందర్ పై దాఖలైన రెండు పిటిషన్లను డిస్మిస్ శారు.స్పీకర్ తీర్పు తర్వాత దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వ్యక్తిగత నిర్ణయంతోనే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశానని దానం నాగేందర్ పేర్కొన్నారు. తన ఫండమెంటల్ రైట్ను కాలరాసే హక్కు ఎవరికీ లేదని.. ఆరు నెలలుగా క్షోభను అనుభవించానన్నారు. స్పీకర్ని కూడా ఆరు నెలలుగా ఇబ్బంది పెడుతూ వచ్చారని.. దానం పేర్కొన్నారు.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించిన కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి కారు గుర్తుతో పోటీచేసిన కడియం శ్రీహరి..కాంగ్రెస్లో చేరడాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ ఫైల్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషనపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరుగనుంది. దాంతో.. అంతకంటే ముందే స్పీకర్ తన తీర్పును వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్