- Advertisement -
బీఆర్ఎస్ కు భారీ షాక్
కాంగ్రెస్ లో చేరిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ దంపతులు
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ఆయన సతీమణి, బీఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్నతో కలిసి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన రామ్మోహన్ గౌడ్ దంపతులకు పార్టీ కండువ కప్పి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
- Advertisement -