తబిత ఆశ్రమలో జన్మదిన వేడుకలు
Birthday celebrations at Tabitha Ashram
ఆశ్రమా నిర్మాణానికి 50,000 చెక్ అందించారు.
ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు చలి శ్వేటర్స్, నూతన వస్త్రాలు పంపిణి..
రామగుండం :
గోదావరిఖనికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిత క్రాంతికుమార్ చిన్న కూతురు క్రితినందన జన్మదినం సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో ఘనంగా పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం పిల్లలందరికి చలికాలం సందర్భంగా నూతన స్వేటర్లు, మరియు వస్త్రాలు అందించి రుచికరమైన బోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అనిత క్రాంతి కుమార్ మాట్లాడుతూ తబితా ఆశ్రమ పిల్లలకు నిరంతరం మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా తబితా ఆశ్రమ నిర్మాణానికి 50వేల రూపాయలు మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని పిల్లలకు కావలసిన సౌకర్యాలు మరియు వారికి విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు వారికి అవసరమైనటువంటి వస్తువులు అన్నింటిని కూడా మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు భూక్య విమల వీరేందర్ గార్లతో పాటు మాజి ఎమ్మెల్యే కోరుకొంటి చందర్, పెంట రాజేష్, మరియు అనిత క్రాంతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



