- Advertisement -
కమలం… అదిరిపోయే వ్యూహం….
BJP... a strategy to overcome...
హైదరాబాద్, జనవరి 30, (వాయిస్ టుడే)
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో రోజు రోజుకీ బలం పెంచుకుంటోంది. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన చెప్పుకోదగ్గ స్థానాలు దక్కలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసారిగా పార్టీ పుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఐదు నుంచి ఆరు స్థానాలతో గెలిచే అవకావముంటుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే బీజేపీ ఎనిమిది స్థానాలు సాధించి ప్రజలు మద్ధతు తమ వైపు ఉందని ప్రూఫ్ చేసుకుంది ఈ ఎన్నికల్లో బీజీపీ, కాంగ్రెస్‌కు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి.అయితే అప్పటి నుంచి బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీల కార్యకర్తలను పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకుంటుంది. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలనే గెలివాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ల సారధ్యంలో బీజేపీ నేతలు జనాల్లోకి పార్టీ తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. త్వరలో జరగబోయే శాసనమండలి, గ్రామ పంచాయతీ ఎన్నికలనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారుశాసనమండలిలో బలం పెంచుకునేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు కైవసం చేసుకునేందకు పార్టీ నాయకులను, కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ సెగ్మెంట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకిత ఉందనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. మంచి అవకాశాన్ని వదులుకోవద్దని పార్టీ కార్యకర్తలు, నాయకులతో చెప్పుకొస్తుంది.మూడు చోట్ల అభ్యర్థులను గెలిపించేలా శాయశక్తులా కష్ట పడాలని అధిష్టానం కోరుతున్నది. అంతే కాకుండా వారం రోజుల్లో ప్రచార కమిటీలు, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా బాధ్యులను నియమించుకునేందకు కసరత్తు కూడా ప్రారంభించనుంది. కాగా.. పార్టీ తరఫున ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పులి నరోత్తం రెడ్డి, కరీంనగర్- నిజామాబాద్ – ఆదిలాబాద్- మెదక్ టీచర్ సెగ్మెంట్ కు ముల్క కొమురయ్య పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే.. టీచర్లు, గ్రాడ్యుయేట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల విజయం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు సార్లు బీజేపీ సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లతో సమావేశింది. బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేదంర్, కాసం వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, తదితర కీలక నాయకులతో సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోంది.
- Advertisement -