కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ
హైదరాబాద్, సెప్టెంబర్ 15: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల వరకు బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే అమృత మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా.. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఈ ర్యాలీని జరుపుతోంది. నిజాం రజాకార్ల పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులు అర్పిస్తూ సాగే ఈ ర్యాలీని తెలంగాణ ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుండి బైక్ నడపుతూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాఠశాల పుస్తకాల్లో విమోచన పోరాటాన్ని పొందుపరచాలని, సైనికులు మరణించిన స్థలాలను స్మారక చిహ్నాలుగా అభివృద్ధి చేయాలే డిమాండ్ తో బీజేపీ బైక్ ర్యాలీ చేపట్టింది.
సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ, తార్నాకా, ఉప్పల్, భైరోన్ పల్లి, ఖిలాషాపూర్, పరకాల మీదుగా బైక్ ర్యాలీ సాగనుంది. అలాగే ఈరోజు సాయంత్రం బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. పరేడ్ గ్రౌండ్ లో 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ముగ్గురు సీఎంలకు కూడా ఆహ్వానం పలికారు. సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ పథకాన్ని వరంగల్ లో లాంచ్ చేయబోతున్నారు. అనంతరం అధికారిక కార్యక్రమంతో పాటు బీజేపీ బహిరంగ సభలను.. అక్కడే రెండు వేర్వేరు చోట్ల నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 450 మందిని సెలెక్ట్ చేసి మండలాల వారీగా పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన పరేగ్ గ్రౌండ్స్ లో జరగబోయే సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఎగురవేసి, ారా మిలటరీ బలగాల కవాతుతో గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో వరుసగా రెండో ఏడాది కూడా పాల్గొంటారు.