కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 27) : కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్ గౌడ్ బుధవారం ఒక శాటిలైట్ ఛానల్ నిర్వహించిన టీవీ డిబేట్లో మాజీ ఎమ్మెల్యే బిజెపి
ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై భౌతికంగా దాడి చేయడం పట్ల… కుత్బుల్లాపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తరఫున బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కే పి వివేకానంద పై పిర్యాదు చేసారు. ఉద్దేశ పూర్వకంగా బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేసాడని, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల పై భౌతిక దాడులు చేయడం పట్ల.. అతనిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి, ఎన్నికల్లో ఫోటి చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు
కుత్బుల్లాపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పై బీజేపీ పిర్యాదు
- Advertisement -
- Advertisement -



