- Advertisement -
లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి.. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
ఎన్నికల నేపథ్యంలో నేడు కేరళలోని వయనాడ్ లో ఆయన రోడ్ షో లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ శక్తులు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ, భారత కూటమి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. అలాగే ప్రధాని మోడీ దేశంలోని అత్యంత ధనవంతులను రక్షిస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. ప్రస్తుతం ఆయన ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
- Advertisement -