మెదక్: మెదక్ పట్టణంలో సాయి బాలాజీ గార్డెన్స్ లో మెదక్ నియోజక వర్గ స్థాయి బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి ,దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు హజర్యారు. వచ్చే ఎన్నికలలో బిజెపి పార్టీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు చెయ్యవలసిన కార్యక్రమాలు, ఎలక్షన్ ప్రణాళిక గురించి చర్చించారు.
నాయకులు అందరూ కలిసి కట్టుగా పని చేస్తే విజయం మన సొంతం అవుతుంది. మెదక్ కిల్లా మీద బిజెపి జెండా ఎగరువేద్దాం అని నియోజకవర్గంలోని ప్రతి బూత్ లో రేపు ఉదయం 9గంటలకు సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపన్నాకి ఒక ఇన్చార్జి (పన్నా ప్రముఖ్)నియమించి ఎన్నికల్లో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారుర. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, తాళ్లపల్లి రాజశేఖర్ రావు,జిల్లా అధికార ప్రతినిధి నందా రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవ్ మధు,జిల్లా ఇన్చార్జ్ మల్లారెడ్డి,అసెంబ్లీ ప్రభావి శ్రీ సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి,నిజాంపేట్ జెడ్పిటిసి పంజా విజయ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉదయ్ కిరణ్,జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు పి దత్తు ,ప్రకాష్,మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండ వేణు , వివిధ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యద్శులు పాల్గొన్నారు.


