మాకు మున్సిపాలిటీలు తక్కువగా వచ్చినప్పటికీ ఓట్ల శాతం పెరిగింది.
15 + మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్ ఫిబ్రవరి 16
BJP has emerged as the single largest party in 15+ municipalities: BJP Telangana State President N. Ramchandra Rao
మాకు మున్సిపాలిటీలు తక్కువగా వచ్చినప్పటికీ ఓట్ల శాతం పెరిగిందని,15 + మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయoలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట, భైంసా మున్సిపాలిటీల్లో బీజేపీ చైర్ పర్సన్ పీఠం పదవి దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.భైంసాలో గత కాంగ్రెస్ హయాం నుంచే.. బీజేపీ కార్యకర్తలు, హిందూ ధార్మిక సంస్థల సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారు.. అడ్వకేట్ గా నేను ఎంతో మంది బెయిల్ ఇప్పించిన. ఇంతకాలం బీజేపీ మజ్లిస్, కాంగ్రెస్ మజ్లిస్ కలిసి.. భైంసాలో బీజేపీని రానివ్వలేదు.భైంసాలో ఎంఐఎం పార్టీ ఎన్నో ఆగడాలకు పాల్పడింది.మాకు మున్సిపాలిటీలు తక్కువగా వచ్చినప్పటికీ ఓట్ల శాతం పెరిగింది.చాలా మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆధిక్యం చూపింది.ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించింది.గతానికి భిన్నంగా బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. 15 + మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది.ఖమ్మం, వరంగల్, కొత్తగూడం, పరకాల లాంటి చోట్ల బీజేపీ సత్తా చాటింది.చాలా చోట్ల మా ఓటు బేస్ పెరిగింది. బీఆర్‌ఎస్ పార్టీకి గతం కంటే 14 శాతం ఓట్లు తగ్గాయి.బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 13 మున్సిపాలిటీలకు పరిమితమైంది.అధికారంలో ఉన్న అధికార పార్టీకి కూడా మెజార్టీ సీట్లు రాలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.నిజామాబాద్ లో 28 చోట్ల బీజేపీ గెలిచి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది.మజ్లిస్ పార్టీ ఓటు పర్సంటేజీ.. తగ్గినా.. వారి ప్రభావం రాష్ట్రంలో పెరుగుతున్నది.నిర్మల్ లో ఒక వార్డులో ఎప్పుడూ లేనంతగా మైనార్టీ ఓట్లు పెరిగాయి. దీని మీద మాకు అనుమానం ఉన్నది. దీనిపై ఫిర్యాదు చేశాం.20 శాతం నుంచి 57 శాతానికి మైనార్టీ ఓట్లు ఎలా పెరిగాయి? బీజేపీని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయి.ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి.. బీజేపీకి మేయర్, చైర్ పర్సన్ పదవులు రానివ్వకుండా కుట్ర చేశారు.ఈ మూడు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలి.ఎర్రజెండా ఎక్కడా లేకున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ ఎర్రజెండాకు అధికారం వచ్చేలా చేస్తున్నది.బీజేపీ ఎప్పుడూ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ అభివృద్ధి కనిపిస్తున్నది.ఏప్రిల్ లో ఎస్ఐఆర్ రాబోతున్నది. హైదరాబాద్ లో దొంగ ఓట్లు, బయటి ఓట్లు తీసేయబోతున్నం. బీఎల్ వోలు, ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఒక్కో ఇంటిపై 60 ఓట్ల వరకు నమోదు చేస్తున్నారు.మాకు ఓటు వేసిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేసారు.



