Saturday, February 21, 2026

కులగణన విషయంలో  మాట తప్పిన బీజేపీ : కల్వకుంట్ల కవిత

- Advertisement -

కులగణన విషయంలో  మాట తప్పిన బీజేపీ
కల్వకుంట్ల కవిత
హైదరాబాద్

BJP has failed to speak on the issue of caste census: Kalvakuntla Kavitha
దేశ వ్యాప్తంగా జనగణన, కులగణన పై ఎక్సర్ సైజ్ జరుగుతోంది. నిజానికి పదేళ్ల కు ఒకసారి జనగణన చేయాలి. 2021 లో జనగణన చేయాల్సి ఉండే.కానీ కోవిడ్ కారణంగా జనగణన చేయలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
గురువారం బంజారాహిల్స్ ఖాజా  మాన్షన్ లో జరిగిన జాతీయ జన గణనలో కులగణన – సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశం లో ఆమె మాట్లాడారు.
కవిత మాట్లాడుతూ ఐతే కులగణన పై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ రావటంతో కేంద్రం అందుకు అంగీకరించింది.  నిజానికి కులగణన చేయాలన్న బుద్ది బీజేపీ రావటం మమ్మల్ని ఆశ్చర్యపరించింది.  జనగణన చేసినప్పుడే ఏ వర్గం ఎంత ఉంది? వారికి బడ్జెట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుంది.  కులగణనకు కేంద్రం ముందుకు రావటంతో సంతోషించాం.  కానీ ఎప్పుడైతే డాక్యుమెంట్ విడుదల చేశారో అప్పుడే వాళ్ల బుద్ది బయట పడింది.  ఎస్సీ, ఎస్టీ ల కాలం పెట్టారు. ఓబీసీ లేకుండా కులం అనే కాలం మాత్రమే డాక్యుమెంట్ లో పెట్టారు.  దీని ద్వారా భారతీయ జనతా పార్టీ…భారత ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.
కులాల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కులాలను పిలుస్తారు.  నన్నే తీసుకుంటే నేను వెలమ. తెలంగాణలో ఓసీ, మహారాష్ట్రలో ఎస్సీ, ఏపీ లో బీసీని. చిన్న సంఖ్యలో ఉన్న కులానికే ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి.  మరి 56 శాతం ఉన్న బీసీల విషయంలో ఎంత గందరగోళం ఉంటుందో ఆలోచించాలి.  గతంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారు. వాళ్లు ఏ కేటగిరీలో వస్తారో చెప్పలేదు.  ఇవ్వాళ మన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కమ్యూనిటీల వాళ్లు వచ్చారు.
మనం ఇచ్చే అభిప్రాయం రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి సూచికలా ఉండాలి.  బీజేపీ కులగణన విషయంలో ఇచ్చిన మాట తప్పినట్లు స్పష్టంగా తెలుస్తోంది.  అన్ని రాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది.  తెలంగాణ నుంచి మన అభిప్రాయం కూడా ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం.  తెలంగాణలో ఉన్న కులాలు, వాటి ఉపకులాల నివేదిక జాగృతి సిద్ధం చేస్తుంది.  నిజానికి ఈ పని ప్రభుత్వమే చేయాలి. కానీ వాళ్లకు చిత్తశుద్ది లేదు.  అందుకే మేము అందరినీ ఒపీనియన్స్ తీసుకోవాలని నిర్ణయించాం. తెలంగాణ థింక్స్, ఇండియా ఫాలోస్ నెక్స్ట్ అనే విధంగా మనం ఉంటాం. కులగణన విషయంలోనూ మనం అదే విధంగా నివేదికను కేంద్రానికి ఇద్దాం.  ప్రతి కులానికి అన్ని హక్కులు సాధించుకునేలా ప్రయత్నం చేద్దాం.  ఇలాంటి అంశంలో రాజకీయ పార్టీల పాత్ర కీలక.  కచ్చితంగా ఈ అంశంపై ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి.  కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో ఏమీ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పరిస్థితి అంతే.  బీజేపీయే డాక్యుమెంట్ విడుదల చేసింది. కనుక వాళ్లు ఆ డాక్యుమెంట్ గా మద్దతుగా మాట్లాడుతున్నారు.  కానీ అన్ని పార్టీలు కూడా తమ స్టాండ్ ఏంటో చెప్పాల్సిందేనని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్