Sunday, March 30, 2025

 బీసీ ఉచ్చులో బీజేపీ

- Advertisement -

 బీసీ ఉచ్చులో బీజేపీ
హైదరాబాద్, మార్చి 26, (వాయిస్ టుడే)

BJP in BC trap

బీసీ రిజర్వేషన్ బిల్లు శాసన సభలోను, శాసన మండలిలో ఆమోదం పొందింది. ఇక బీసీ రిజర్వేషన్లు పెరగనున్నాయి. ఇప్పటి దాకా విద్య ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన నిర్వహించింది. ఈ గణనలో 56.36 శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు బీసీలకు 42 శాతానికి రిజర్వేషన్ల పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సంబంధింత బిల్లులకు చట్ట సభలు ఆమోద ముద్ర వేశాయి. అంటే ఇక నుంచి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ నియామకాల్లో, అదే రీతిలో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ఫలాలు బీసీలకు దక్కనున్నాయి. ఇంతటితో పని పూర్తి అయినట్లు కాలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని చట్ట సభలు బిల్లుకు ఆమోద తెలిపి కేంద్రానికి పంపనుంది.దేశంలో రిజర్వేషన్ల పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఆయా కులాల జాబితాను మార్చాలన్నా రాష్ట్రాలకు అధికారం లేదు. ఈ అంశం కేంద్ర జాబితాలోది. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇక చట్ట సభల ఆమోదం పొందిన ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ఆ బిల్లును పార్లమెంట్ మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అలా మించితే రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ -9లో చేర్చాలి. ఈ రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇస్తే ప్రస్తుతం ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10 శాతం కలుపుకుంటే మొత్తం 67 శాతానికి చేరుకుంటుంది. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకం. అలా సవరణ చేయాలంటే అందుకు సరైన కారణాలు వెల్లడించారు. అందుకు తగిన గణాంక సమాచారం  అందుబాటులో ఉంటే అప్పుడు తగిన కారణాలతో రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ కారణలతోనే రేవంత్ సర్కార్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి లీగల్‌గా ఎదుర్కునే రీతిలో పటిష్టంగానే బీసీ గణన చేపట్టింది. సమగ్ర కుటుంబ సర్వే తర్వాతనే బీసీ లెక్కలను తెల్చి చెప్పింది. ఆ తర్వాత చట్టసభల్లో ఈ బిల్లులకు ఆమోద ముద్ర పడింది. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు బంతి కేంద్రం కోర్టులో పడేసింది. పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మద్దతు ఇస్తే రాజ్యాంగ సవరణ వీలవుతుంది. అప్పుడే రాష్ట్రంలో పెంచిన బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందే బీసీ గణన చేపడతామని చెప్పింది. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ముఖ్యనేత రాహూల్ గాంధీ చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో ఇదే ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా రేవంత్ సర్కార్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే దేశవ్యాప్త కులగణన విషయంలో మోదీ సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీసీలంతా ఐక్యంగా ఉండాలని, బీసీ లెక్కలు అవసరం లేదన్న రీతిలో మోదీ నర్మగర్భంగా తన అభిప్రాయాన్ని వెళ్లడించారు. ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంపు బిల్లుకు ఆమోద ముద్ర వేస్తే అది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఓ అస్త్రంగా మారనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించినందుకు మేం బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు పెంచామని, పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది చేసి చూపించామని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అలా బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశం లేకపోలేదు. ఇలా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేలా మోదీ సర్కార్ తెలంగాణ బీసీ రిజర్వేన్ల పెంపు బిల్లుకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా చూడాలి.తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే తేనె తుట్ట కదిపినట్లే. ఇదే రీతిలో అన్ని రాష్ట్రాల నుంచి రిజర్వేషన్ల పెంచాలన్న డిమాండ్లు వస్తాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఈ సమస్య ఎదురుకావచ్చు.  ఒక వేళ ఈ రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండా పక్కన పెడితే బీసీ వ్యతిరేక పార్టీగా బీజేపికి తెలంగాణలోను, దేశవ్యాప్తంగా ముద్రపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిమాండ్లే ఏపీ నుంచి, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చే అవకాశం ఉంది. వారిని కాదని కేంద్రంలో బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీ నిర్లయం తీసుకోలేని పరిస్థితి. ఒక వేళ తీసుకుంటే ఆ సక్సెస్ తన ఖాతాలో పడుతుందా లేక మొదటి నుంచి బీసీ రాగం వినిపించిన కాంగ్రెస్ ఖాతాలో పడుతుందా అన్న డైలమా కమలనాథుల్లో లేకపోలేదు. రానున్న రోజుల్లో ఈ బీసీ ఉచ్చు నుంచి బీజేపీ ఎలా తప్పుకుంటుందో వేచి చూడాలి. అయితే తెలంగాణలోని రాజకీయ పార్టీలను తీసుకుని ప్రధానికి కలవాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ రిజర్వేషన్ల బిల్లు ఎందాక ముందుకు సాగి ఆచరణలోకి వస్తుందో మాత్రం వేచి చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్