ప్లాన్ బీలో బీజేపీ….
న్యూఢిల్లీ, జూన్ 6,(వాయిస్ టుడే)
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఎన్‌డీఏ పక్ష నేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ 344 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇండియా కూటమికి 244 స్థానాలు వచ్చినా.. ఆ కూటమిలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ 99 దగ్గరే ఆగిపోయింది. ఎన్డీ కూటమి ఏర్పాటు ఖాయమైంది. జూన్ 8 లేదా 9వ తేదీల్లో మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఇదిలా ఉంటే ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ, టీడీపీ కీలకంగా మారాయి. టీడీపీకి 16 ఎంపీ స్థానాలు ఉండగా, జేడీయూకు 12 ఎంపీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ తర్వాత ఎక్కవ సీట్లు ఉన్న పార్టీలు ఈ రెండే. దీంతో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఈ రెండే కీలకంగా మారాయి. దీంతో బీజేపీ సర్కార్ ఇక ఈ ఐదేళ్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. బీజేపీ ఎజెండీ తాత్కాలికంగా అటకెక్కినట్లేఇదిలా ఉంటే…బీజేపీ ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూను నమ్మడం లేదు. ప్రస్తుతం మద్దతు ఇస్తున్నా.. గతంలో ఈ రెండు పార్టీలు బీజేపీని మధ్యలో వీడినవే. ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని.. చివరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని 2018లో టీడీపీ ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇక జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ కూడా వివిధ కారణాలతో ఇప్పటి వరకు రెండుసార్లు ఎన్‌డీఏ నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ ఇద్దరు నేతలను పూర్తిగా నమ్మడం లేదు.మరోవైప కాంగ్రెస్, ఆర్జేడీ, శివసేన ఠాక్రే వర్గం, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయి. అదే జరిగితే 28 సీట్లు ఎన్డీఏ కోల్పోతుంది. దీంతో మోదీ సర్కార్ మ్యాజిక్ ఫిగర్‌కు 17 సీట్లు తగ్గుతాయి. దీంతో సంక్షోభంలో పడుతుంది.చంద్రబాబు, నితీశ్‌పై నమ్మకం లేని బీజేపీ.. ప్లాన్ బీ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో సిక్కింలోని ఎస్‌కేఎన్ పార్టీ మద్దతు కూడగట్టింది. దీంతో ఎన్‌డీఏ బలం 299కు పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో పాత దోస్తాని పునరుద్ధరణ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక ఏపీలో నాలుగు ఎంపీ స్థానాలు ఉన్న వైసీపీ పార్టీని కూడా మచ్చిక చేసుకునే పనిలో కమలనాథులు ఉన్నారుమరోవైపు ఈ లోక్‌సభ ఎన్నికల్లో 50 మంది ఇతరులు ఎంపీలుగా గెలిచారు. వీరితో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు మొదలు పెట్టారు. జేడీయూ, టీడీపీ ఎన్‌డీఏను వీడినా నష్టం జరుగకుండా వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలో 50 మంది ఇతరుల్లో ఇప్పటికే 20 మంది బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. తద్వారా మోదీ, ప్రభుత్వంటో టీడీపీ, జేడీయూ డామినేషన్ తగ్గించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.