ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ..!!
ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బీజేపీ హైకమాండ్
టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై బీజేపీ ఫోకస్
ఇప్పటికే టికెట్ దక్కని వారు 30 నుంచి 40 మంది లీడర్లు బీజేపీతో టచ్‌లో..
న్యూఢిల్లీ మార్చ్ 1
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ – జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ – జనసేనతో కలిసి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్లొద్దు అని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం.ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రాలో కాపు సీఎం నినాదం ఎత్తుకుని, ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ హైకమాండ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కని వారు 30 నుంచి 40 మంది లీడర్లు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.
ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ..!!

- Advertisement -
- Advertisement -