యూపీలోనూ బీజేపీకి గుబులే
-డాక్టర్ జ్ఞాన్ పాఠక్
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గతంలో ఏనాడూ లేనంతగా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోందని విశ్లేషకుల అంచనా.లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ మే 7వ తేదీన జరగనున్నది. ఈ లోపు ప్రతిపక్షాలు, బీజేపీ, పోటీపోటీగా ఉన్నాయని అంచనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత చాతుర్యంతో చేసే ప్రచారానికి సామాన్యప్రజలు పెద్దగా స్పందించడంలేదు. వాగాడంబర ప్రచారాన్ని సామాన్యప్రజలు పక్కకు తోసేస్తున్నారు. ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను, ఇండియా కూటమిపై చేస్తున్న విమర్శలను సైతం, సామాన్యులు నమ్మడంలేదు. దళితులకు ఎస్‌టీలు, ఓబీసీలకు తాముకూడా రిజర్వేషన్లు కల్పిస్తామని, రద్దుచేయబోమని మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లపై భిన్నస్వరాలతో బీజేపీ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. ఇండియాకూటమిని గెలిపిస్తే, హిందువుల సంపదను తీసుకువెళ్లి ముస్లింలకు పంపిణీ చేస్తారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని కూడా సామాన్యులు విశ్వసించడంలేదు. మూడవదశలో 10లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సంభల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్‌సిక్రీ, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటాప్‌ా, బదౌల్, బరేలి, అవోన్లా నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. బిఎస్‌పీ కూడా పోటీలో ఉన్నది. గతంలోవలే బీఎస్‌పీ నేత మాయావతికి ఉన్న తోడ్పాటు లేదు. ఆ పార్టీనుంచి అనేకమంది ప్రముఖులు ఇతర పార్టీలవైపు వెళ్లిపోయారు. కొందరు కాంగ్రెస్‌లోకి, మరికొందరు సమాజ్‌వాదీ పార్టీలోకి వెళ్లిపోయారు.
బీజేపీకి 2019లో వచ్చినన్ని ఓట్లు ఈసారి రావని, చాలాచోట్ల ఓటర్లు చెల్లాచెదురయ్యారని బీజేపీ ఆందోళన చెందుతోంది. 2019లో 62 సీట్లు గెలుచుకున్న బీజేపీకి 2014లో వచ్చిన ఓట్లకంటే 9శాతం ఓట్లు తగ్గిపోయాయి. ఈ సారి 49.56శాతం ఓట్లు మాత్రమే లభించాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లభించిన ఓట్లశాతం మరింతగా 41.29శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో సమాజ్‌వాదిపార్టీ ఓట్ల శాతం ఆ తర్వాత 17.96శాతం నుండి 32.06శాతానికి పెరిగింది. ఈ నేపధ్యంలో 2024లోక్‌సభ ఎన్నికల్లో మరింతగా ఓట్లశాతం తగ్గిపోతుందని బీజేపీ గ్రహించింది. అందువల్లనే ఉన్నవి,లేనివి కల్పించి ప్రధాని మోదీ ఇతర బీజేపీ నాయకులు అబద్ధాల ప్రచారాన్ని మరింతగా పెంచారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో సంభల్ సీటును సమాజ్‌వాది(ఎస్‌పీ) పార్టీ గెలుచుకుంది. అలాగే ఎస్‌పీ బిఎస్‌పీతో కలిసి పోటీచేసినప్పుడు గెలవడమేకాక, ఓట్లు శాతం పెంచుకుంది. బీజేపీ అభ్యర్థిని ఓడిరచి 174,826 ఓట్లను అధికంగా తెచ్చుకుని గెలుపొందింది. ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో ఎస్‌పీ,బిఎస్‌పీలు విడివిడిగా పోటీచేస్తున్నాయి. అందువల్ల ఈ సారి సంభల్ సీటును గెలుచుకోగలమని బీజేపీ ఆశిస్తున్నది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు బిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంభల్ లోక్‌సభ నియోజకవర్గంలో 5 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 4సీట్లు ఎస్‌పీ గెలుచుకుంది. ఈసీటు సమాజ్‌వాదికి బలమైన కోట. ఇక్కడ సమాజ్‌వాదీ ఆధిక్యస్థానంలో కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ తరఫున జియాఉర్‌రెహమాన్ పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థి పరమేశ్వర్‌లాల్ సైని పోటీలో ఉన్నారు. జియాఉర్‌రెహమాన్ మాజీ ఎంపీ షఫికర్ రెహమాన్ బర్గ్ మనవడు. గ్యాంగ్‌స్టర్లుగా పేరుపొందిన ముక్తార్ అన్సారీ, ఆసిఫ్ అహ్మద్‌లు బీజేపీ సాగించిన ఎన్‌కౌంటర్‌లలో బలైపోయి ప్రాణత్యాగం చేశారని వారిపేరుమీద ఓట్లను తమకువేసి గెలిపించాలని ప్రచారంచేస్తున్న జియాఉర్‌రెహమాన్ పైన కేసు నమోదుచేశారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం బీజేపీకి అలవాటుగా మారింది. ఈ నేపధ్యంలోనే రెహమాన్‌పై కేసు నమోదుచేశారు. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా తాను గెలుపొందాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నది. అయినప్పటికీ దాని ఆటలు సాగబోవని ఎస్‌పీ మంచి పలుకుబడితో జనాన్ని ఆకర్షించిందని చెపుతున్నారు. అలాగే ఫిరోజాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఎస్‌పీ నీళ్లు తాగించే స్థాయిలోనే పలుకుబడికలిగిఉంది.
2019లో ఈ సీటును బీజేపీ గెలుచుకున్నది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పరిస్తితులు గణనీయంగా మారిపోయాయి. అందువల్ల బీజేపీ గెలుచుకునే అవకాశం లేదు. ఈ నియోజకవర్గంలో యాదవుల సంఖ్య చాలా ఎక్కువగాఉంది. అందువల్ల ఎస్‌పీ అభ్యర్థిగెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో బిఎస్‌పీ అభ్యర్థిగా పోటీచేసిన విశ్వదీప్ సింగ్‌ను ఈ సారి బీజేపీ తమ అభ్యర్థిగా నిలిపింది. ఈ నియోజకవర్గంలోనూ బీఎస్‌పీకూడా పోటీచేస్తున్నది. అందువల్ల బీజేపీ గెలుపు సాధ్యంకాదని ఆ పార్టీకి అదనపు ప్రయోజనాలు ఏమీలేవు. 2019లో బీజేపీ తరఫున ఎన్నికైన అభ్యర్థి నియోజకవర్గంలో క్రియాశీలంగా లేడు. ఎస్‌పీ తరఫున అక్షయ్‌యాదవ్ పోటీచేస్తున్నాడు. ఈయన ఇతర అభ్యర్థులకంటే ఆధిక్యస్థానంలో ఉన్నాడని అంచనావేస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మూడు స్థానాలను ఎస్‌పీ గెలుచుకుంది. డిరపుల్‌యాదవ్ ఎస్‌పీ అభ్యర్థిగా ఈసారి పోటీ చేస్తున్నారు. డిరపుల్ యాదవ్ ఎస్‌పీ అధినేత అఖిలేష్‌యాదవ్ సతీమణి. 2022 అక్టోబరులో ములాయం సింగ్‌యాదవ్ మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనై డిరపుల్‌యాదవ్ గెలుపొందారు.
బదౌన్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున సంఘమిత్ర మౌర్య 2019లో పోటీచేసి ఎస్‌పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై గెలుపొందారు. ఈ సారి ఈ స్థానాన్ని గెలుచుకోవడం కష్టమేనని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే ఈసారి అభ్యర్థిని మార్పుచేశారు. బీజేపీ అభ్యర్థిగా దుర్విజయ్‌సింగ్ శాఖ్య పోటీచేస్తుండగా, ఎస్‌పీ అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు శివ్‌పాల్‌సింగ్ కుమారుడు ఆదిత్యయాదవ్ పోటీచేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఎస్‌పీ ఇక్కడ బలంగాఉంది. లోక్‌సభ నియోజకవర్గంలో 5 అసెంబ్లీ స్థానాలుండగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పీ 3సీట్లు గెలుచుకుంది. హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్‌సిక్రీ, బరేలి,ఎటాప్‌ా, అవోన్లా నియోజకవర్గాలలో బీజేపీ ఎస్‌పీ కంటే పైచేయిలో ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి ఎస్‌పీకి అనుకూలంగా పరిస్తితులు మెరుగుకావచ్చునని అంచనా వేస్తున్నారు. ఎస్‌పీ అభ్యర్థులు ఈ నియోజకవర్గాలలో బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్నారు.
అనేక అసెంబ్లీ స్థానాల్లో ఎస్‌పీ కుటుంబాలకు చెందినవారు పోటీలో ఉన్నారు. మూడవదశలో జరిగే 10అసెంబ్లీ స్థానాలు, ఇంతకుముందు జరిగిన రెండుదశల్లో పోటీచేసిన స్థానాల్లో కలిసి మొత్తం 26సీట్లలో పోలింగ్ పూర్తవుతుంది. రాష్ట్రంలో 80 నియోజకవర్గాలున్నాయి. మొదటిదశ ఎన్నికల్లో బీజేపీకి అంతగా ప్రయోజనంలేదని అంచనాలు వచ్చాయి. రెండవదశలో బీజీపీకి అనుకూలంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రతిదశలోనూ 8సీట్లకు పోటీ జరుగుతుంది. అయితే ఈసారి 10నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు విస్త్రతంగా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్,ఎస్‌పీలు ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు నడుపుతున్నాయని బీజేపీ ప్రచారం సాగిస్తోంది. మూడవదశ ఎన్నికల్లో 8 సీట్లలో గెలవగలమని విశ్వసిస్తోంది.