Friday, March 21, 2025

భారతీయులంతా ఇష్టపడే పార్టీ బీజేపీ

- Advertisement -

నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1980 ఏప్రిల్ 6న స్థాపించడం జరిగింది. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 44 ఏళ్ల బీజేపీ ప్రయాణాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగాపోస్ట్ చేశారు. ఇన్నేళ్లుగా తమ కఠోర శ్రమ, పోరాటం, త్యాగాలతో పార్టీని ఈ స్థాయికి తీసుకెళ్లిన బీజేపీలోని మహానుభావులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ‘నేషన్ ఫస్ట్’ అనే మంత్రంతో ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉన్న బీజేపీ దేశంలో అత్యంత ఇష్టమైన పార్టీ అని ఇందు కోసం కృషీ చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అభినందనలు అంటూ మోదీ పేర్కొన్నారు.బీజేపీ తన అభివృద్ధి దృక్పథం, సుపరిపాలన, జాతీయవాద విలువలకు ఎల్లప్పుడూ అంకితమై ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు ప్రధాని మోదీ. 140 కోట్ల మంది దేశప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పగలు రాత్రి శ్రమిస్తున్న కార్యకర్తలే బీజేపీకి అతిపెద్ద బలమన్నారు. దేశంలోని యువత తమ కలలను సాకారం చేసి 21వ శతాబ్దంలో భారతదేశానికి బలమైన నాయకత్వాన్ని అందించగల సత్తా ఉన్న పార్టీగా బీజేపీని చూస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కేంద్రమైనా లేదా రాష్ట్రమైనా, బీజేపీ సుపరిపాలనను పునర్నిర్వచించిందన్నారు మోదీ. పార్టీ ప్రణాళికలు, విధానాలు దేశంలోని పేద, అణగారిన సోదరసోదరీమణులకు కొత్త బలాన్ని ఇచ్చాయని, దశాబ్దాల తరబడి అట్టడుగున ఉన్న ప్రజలు బీజేపీలో తమకు పెద్ద ఆశాకిరణాన్ని చూశారన్నారు. తమ బలమైన గొంతుకగా బీజేపీ ముందుకు వచ్చింది. ఎల్లప్పుడూ మొత్తం అభివృద్ధి కోసం పని చేస్తున్నాం. ఇది ప్రతి భారతీయుడి జీవితాన్ని సులభతరం చేసిందన్నారు ప్రధాని మోదీ.

అవినీతి, ఆశ్రిత పక్షపాతం నుంచి దేశాన్ని విముక్తం చేస్తున్నామని, అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, మతతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో ఉందని మోదీ అన్నారు. దశాబ్దాలుగా పాలించిన పార్టీలు ఈ రాజకీయ సంస్కృతినే దేశానికి గుర్తింపుగా మార్చుకున్నాయి. కొత్త భారతదేశంలో స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన కారణంగా, అభివృద్ధి ప్రయోజనాలు నేడు ఎటువంటి వివక్ష లేకుండా చివరి దశలో ఉన్న పేదలకు చేరుతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

NDA గురించి ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ, ‘NDAలో అంతర్భాగంగా బీజేపీ ఉన్నందుకు గర్విస్తున్నాము, ఎందుకంటే ఈ కూటమి దేశ పురోగతిని, ప్రాంతీయ ఆకాంక్షలతోపాటు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని విశ్వసిస్తోంది. NDA కూటమి, దేశ వైవిధ్యం, అందమైన రంగులతో అలంకరించబడింది. ఈ భాగస్వామ్యం రాబోయే కాలంలో మరింత బలపడుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

“కొత్త లోక్‌సభను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ప్రధాని మోదీ, గత దశాబ్దంలో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం నిర్మించిన పునాదికి కొత్త బలం చేకూర్చేలా, దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులు మమ్మల్ని మరోసారి ఆశీర్వదించబోతున్నారని విశ్వసిస్తున్నాను. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అభివృద్ధిలో బలమైన లింక్ అయిన బీజేపీ, ఎన్‌డిఎ కార్యకర్తలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్