Sunday, September 8, 2024

బీజేపీ బిందాస్ రాజకీయం చేస్తుంద

- Advertisement -

మరో ప్లాన్ లో బీజేపీ నేతలు
హైదరాబాద్, జూలై 18,

BJP leaders in another plan

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అతి పెద్ద టాపిక్. కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఆకర్షితులవుతున్నారు. మొత్తం రాజకీయం ఈ రెండు పార్టీల మధ్యే సాగుతోంది. కానీ మరో కీలకమైన పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఆకర్ష్ రాజకీయాల్లోకి రావడం లేదు. మామూలుగా అయితే ఆపరేషన్ కమల్ ప్రారంభించి గ్రౌండ్ ను దున్నేయాల్సిన బీజేపీ సైలెంట్ గా ఉండిపోతోంది. పిలిచినా ఎవరూ రారని సైలెంట్ గా ఉంటున్నారా లేకపోతే కీలక నేతలకు కేంద్ర మంత్రి పదవులు రావడం. ఇతర నేతలకు రాష్ట్ర స్థాయిలో చేరికలకు ప్రయత్నించే బాధ్యతలు కూడా ఇవ్వకపోవడంతో ప్రయత్నించడం లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే తెలంగాణ రాజకీయ పరిణామాల పట్ల పూర్తి స్పష్టతతో ఉన్న  బీజేపీ కేంద్ర పార్టీ పెద్దలు.. ఎలాంటి దూకుడు అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చేరికలపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని సంకేతాలు ఇచ్చిందంటున్నారు. ఎందుకని ?భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఎవరు ఎప్పుడు పార్టీ వీడిపోతారోనన్న టెన్షన్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు వచ్చి చేరిపోతానన్న టెన్షన్ ఉంది. అక్కడ వెళ్లిపోతారని బాధ అయితే ఇక్కడ చేరుతారన్న బాధ కూడా ఉంది.  కేసీఆర్  ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి  పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు. భవిష్యత్ మనదేనని చెబుతున్నారు.  కానీ ఆ సమావేసాలకు వెళ్లిన వారు కూడా  పార్టీ మారిపోవడానికి   దారులు వెదుక్కుంటున్నారు. ఎమ్మెల్సీలు కూడా అదే చేస్తున్నారు.   అయితే ఇక్కడ ట్విస్టేమిటంటే ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే రానీ ఎమ్మెల్సీ కానీ   బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ వైపు చూడటం లేదు. అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు.  కాంగ్రెస్ కు తెలంగాణలో పవర్ ఉండవచ్చు కానీ..  బీజేపీకి కేంద్రంలో పవర్ ఉంది.  అయినా బీజేపీ వైపు చూడటం లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు బీజేపీ కూడా ఆసక్తి చూపిస్తుంది. అందులో సందేహం ఉండదు. ఎమ్మెల్యేల చేరిక అంటే పార్టీకి బలమే. ఎమ్మెల్యేతో పాటు క్యాడర్ కూడా వస్తుంది. బీజేపీకి ఇప్పుడు ద్వితీయ శ్రేణి నేతల బలం అవసరం. కానీ అవకాశం దొరికినా … మొత్తం ఎమ్మెల్యేలను కాంగ్రెస్  కు వదిలేస్తోంది కానీ.. తమ పార్టీలో చేర్చునేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. పార్టీలో చేరుతామని వస్తే బీజేపీ ఎవరినైనా చేర్చుకుంటుందేమో  కానీ..  కాంగ్రెస్ తరహాలో ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. చేరుతామని వచ్చే వారి విషయంలో మాత్రం ముందుకెళ్లాలని అనుకుంటున్నారు.  కానీ రాజీనామాలు చేయాలని షరతు పెడతామని బండి సంజయ్ ప్రకటించారు  మరో వైపు తెలంగాణ బీజేపీలో ఓ కీలక నేత  కాంగ్రెస్ లోకి పోయేవారిని ఆపేందు . బీజేపీలోకి రావాలని లేకపోతే బీఆర్ఎస్ లోనే ఉండాలని హెచ్చరికలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం భయపడటం లేదు.  బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సరి పెట్టుకోరు భారీ స్థాయిలో చేయాలనుకుంటారు. అయితే తెలంగాణలో గతంలో చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో  బెడిసికొట్టడంతో  ఈ సారి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఎదురు దెబ్బలు తినడం కన్నా.. జరుగుతున్న రాజకీయాన్ని చూసి సరైన సమయంలో ఎంటర్ అవ్వాలని అనుకుంటూ ఉండవచ్చు. అందుకే కేంద్ర పెద్దలు కూడా పెద్దగా ప్రయత్నించవద్దని సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ సైలెంట్ గా ఉండటానికి మరో కారణం కూడా ఉందని అుకోవచ్చు.  ఎంత మంది  బీఆర్ఎస్ లో చేరినా అది బీజేపీకే లాభం.  ఎందుకంటే  బీఆర్ఎస్ ఎంత బలహీనం అయితే… బీజేపీకి అంత లాభం అని రాజకీయం తెలిసిన వారికి ఎవరికైనా అర్థం అవుతుంది.  ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం  నిరూపించింది. బీజేపీ బలహీన పడిన ప్రతి చోటా ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన ప్రతీ చోటా బీజేపీ గెలిచింది.  అందుకే బీఆర్ఎస్ ను ఫినిష్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకుంటే మాకు అంత కంటే ఎక్కువ ఏమి కావాలన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దరి దాపుల్లో ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా బీజేపీ చేయగలిగింది చేస్తుంది.  అందులో ఎలాంటి ఫలితాలు వచ్చినా అవి వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవని ఇప్పటికే రికార్డులు చెబుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఫినిష్ చేసే బాధ్యత తీసుకుంటే.. పరోక్షంగా ఏమైనా సాయం చేసేందుకైనా రెడీగా ఉంటుంది కానీ అడ్డుకునే అవకాశాలు మాత్రం ఉండవని అనుకోవచ్చు. బీజేపీలో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరకపోవడానికి బీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా ఆసక్తి చూపించకపోవడానికి మరో కారణం కూడా ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  అదే కేసీఆర్ కొన్నాళ్ల తర్వాతైనా బీజేపీతో కలుస్తారన్న నమ్మకం. కేసీఆర్ ఇప్పటికే ప్లాన్ బీ రెడీ చేసుకున్నారని అది బీజేపీ పంచన చేరడమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బీజేపీలో చేరినా  ప్రాబ్లమేనని ఎమ్మెల్యేలు భావిస్తూ ఉండవచ్చు.  అదే కారణంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకుని  ప్రయోజనం ఏమిటని వారు కూడా అనుకుంటూ ఉండవచ్చు. మొత్తంగా బీజేపీ బిందాస్ రాజకీయం చేస్తుందని అనుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం ఏ సమస్యలూ లేని పార్టీ బీజేపీనే. కాంగ్రెస్ , బీఆర్ఎస్ యుద్ధంలో ఎవరు బలహీనపడిపోతే.. వారి బలం తమకే దక్కుతుందని బీజేపీకి అర్థమైపోయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్